జాతీయ వార్తలు

కేంద్రం ప్రచారానికి భారీగా వ్యయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: కేంద్ర ప్రభుత్వం గత అయిదేళ్లలో ఎలక్ట్రానిక్ మీడియాలో తన ప్రచారం కోసం రూ. 2,374 కోట్లు, ఔట్‌డోర్ పబ్లిసిటీ కోసం రూ. 670 కోట్లు వ్యయం చేసింది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఔట్‌రీచ్ అండ్ కమ్యూనికేషన్ సమాచార హక్కు (ఆర్‌టీఐ) కింద దాఖలయిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, టెలివిజన్, రేడియో సహా ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం కోసం 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ. 470.39 కోట్లు, 2015-16లో రూ. 541.99 కోట్లు, 2016-17లో రూ. 613.78 కోట్లు వ్యయం చేసినట్లు వివరించింది. అలాగే, 2017-18లో రూ. 474.76 కోట్లు, 2018లో ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రూ. 273.54 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపింది. 2014 ఏప్రిల్- 2018 డిసెంబర్ మధ్య కాలంలో ఎలక్ట్రానిక్ మీడియాపై రూ. 2,374.46 కోట్లు వ్యయం చేసినట్లు బ్యూరో వివరించింది. బ్యూరోక్రాట్ సంజీవ్ చతుర్వేది ఆర్‌టీఐ చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా బ్యూరో ఈ వివరాలు వెల్లడించింది. ఆల్ ఇండియా రేడియో, డీడీ నేషనల్, ఇంటర్నెట్, ప్రొడక్షన్, రేడియో, ఎస్‌ఎంఎస్, థియేటర్, టీవీ వంటి వాటిపై ఈ మొత్తాన్ని వ్యయం చేసినట్టు వివరించింది. వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్లు, ప్రభుత్వ రంగ సంస్థల తరపున బ్యూరో జారీ చేసిన ఎంప్లాయ్‌మెంట్ నోటీసులు, టెండర్లు, ఇతర నోటీసులు, వివిధ పథకాలకు సంబంధించిన అడ్వర్టయిజ్‌మెంట్లకు ఈ వ్యయం చేసినట్లు వివరించింది.