జాతీయ వార్తలు

ప్రతిపక్షమంతా మీ వెంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడిని భారతదేశ ఆత్మపై జరిగిన దాడిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభివర్ణించారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీతో పాటు మొత్తం ప్రతిపక్షం ప్రభుత్వానికి, భద్రతా బలగాలకు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. భారత్ ప్రేమానురాగాలతో నిర్మితమయిందని పేర్కొంటూ వీటిని విద్వేషం, ఉద్రేకం ఏమీ చేయజాలవని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ శుక్రవారం ఇక్కడ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, పార్టీ సీనియర్ నాయకులు గులాంనబీ ఆజాద్, ఏకే ఆంటోనీలతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఇది భయంకరమయిన విషాదం. అత్యంత ముఖ్యమయిన భారతీయులయిన మన సైనికులపై జరిగిన ఇలాంటి హింస పూర్తిగా అసహ్యకరమయినది. నేను ఒకటి స్పష్టం చేయదలచుకున్నాను. ఉగ్రవాదుల లక్ష్యం ఈ దేశాన్ని విభజించడమే. అయితే మనం ఒక్క సెకను కూడా విభజనకు గురికాబోవడం లేదు’ అని రాహుల్ గాంధీ అన్నారు. ఉగ్రవాద దాడి భారతదేశ ఆత్మపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణిస్తూ, ఈ దాడి చేసిన వారికి ఈ దేశానికి ఏ రకంగానయినా హాని తలపెట్టగలమనే భావనను రానివ్వకూడదు. దేశం ఈ దుష్ట చర్యలను మరచిపోబోదని వారు తెలుసుకొని తీరాలి’ అని రాహుల్ గాంధీ అన్నారు. భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటనపై ప్రశ్నించగా, ‘ఇది దుఃఖించవలసిన సమయం. ఆలోచించవలసిన సమయం. మేము ప్రభుత్వానికి, మన భద్రతా బలగాలకు పూర్తిగా మద్దతు ఇస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. ‘మనం అత్యంతగా ప్రేమించే వారు వీరమరణం పొందారనేది వాస్తవం. ఇది మినహా మేము మరో అంశంపై మాట్లాడబోవడం లేదు. వీర జవాన్ల కుటుంబాలను మనం ఆదుకోవలసిన అవసరం ఉంది. మేము వారికి అండగా నిలబడబోతున్నాం’ అని రాహుల్ గాంధీ అన్నారు. మరో రెండు రోజుల పాటు ఈ అంశం మినహా మరే దాని గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడబోదని ఆయన చెప్పారు. ఈ ఉగ్రదాడికి తగిన సమాధానం ఇవ్వాలని పలువురు రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించగా, ‘నేను ఈ వ్యాఖ్యల్లోకి పోదలచుకోలేదు. నేను చాలా స్పష్టత కలిగి ఉన్నాను. నేను గాయపడ్డాను. ప్రతి ఒక్కరూ గాయపడ్డారు. మేము మీతో ఉన్నాం అని నేను భద్రతా బలగాల కుటుంబాలకు చెప్పదలచుకున్నాను. మా పూర్తి మద్దతు మీకు ఉందని చెప్పదలచుకున్నాను’ అని రాహుల్ గాంధీ అన్నారు. ప్రభుత్వం తీసుకునే చర్యలకు కాంగ్రెస్ సహా మొత్తం ప్రతిపక్షం మద్దతిస్తుందని పేర్కొన్నారు.