జాతీయ వార్తలు

సౌదీ రాజును ప్రశంసించడం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: పాకిస్తాన్‌ను పొగడ్తలతో ముంచెత్తిన సౌదీ అరేబియా రాజు సల్మాన్‌ను మన ప్రధాని నరేంద్రమోదీ విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం పలకడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉగ్రవాదానికి పురిటి గడ్డ పాకిస్తాన్‌ను ఆకాశానికి ఎత్తేసిన సౌదీ రాజుకు ఇంత మర్యాద చేయడం మోదీకి తగదన్నారు. పుల్వానాలో ఉగ్రవాద దాడి జరిగి ఐదు రోజులు పూర్తయిన నేపథ్యంలో పాక్‌ను ప్రశంసించిన సౌదీ నేతను ప్రధాని మోదీ స్వాగతించడం సరైన విధానం కాదని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రణదీప్ సూర్జీవాలా అన్నారు. జాతీయ ప్రయోజనాలను పణంగా పెట్టి మోడీ వ్యవహరించారన్నారు. ఒక వైపు భారత జాతి హృదయాలు భగ్గుమంటుంటే, ఈ సమయంలో వ్యవహరించే తీరు ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. పాకిస్తాన్‌తో కలిసి అభివృద్ధిపై ఉమ్మడి ప్రకటన చేసిన సౌదీ నేతకు ఇంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందా అని ఆయన ప్రశ్నించారు. భారత్ పాకిస్తాన్ మధ్య సమస్యలు పరిష్కారానికి చర్చలు ఒక్కటే పరిష్కారమని సౌదీ నేత చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.