జాతీయ వార్తలు

డోగ్రా కుర్రాళ్లను వెంటనే విడిచిపెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్ము, ఫిబ్రవరి 20: పుల్వానా ఉగ్రవాది దాడికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వంద మంది డోగ్రా కాశ్మీర్ యువకులను వెంటనే విడుదల చేయాలని జమ్ము ప్రొవిన్స్ పీపుల్స్ ఫోరం డిమాండ్ చేసింది. దాదాపు వంద మంది యువకులను పోలీసులు నిర్బంధించారన్నారు. వీరంతా అమాయకులని, దేశ భక్తితో ధర్నా చేస్తుంటే పోలీసులు అదుపులోకి తీసుకుని ఇంతవరకు వదిలిపెట్టలేదన్నారు. ఈ సంస్థ వర్కింగ్ అధ్యక్షుడు ఎంఎస్ కటోచ్ మాట్లాడుతూ జమ్ముకు వెంటనే ఒక కేంద్ర విశ్వవిద్యాలయం, ఒక ఎఐఐఎంఎస్‌ను మంజూరు చేయాలని కోరారు. జమ్ము అభివృద్ధి కోసం ఉద్యమిస్తుంటే, తమను పోలీసులను అనుమానించడం తగదన్నారు. గత ఐదు రోజులుగా జమ్ములో కర్ఫ్యూ అమలులో ఉందన్నారు. భారత వ్యతిరేక నినాదాలు చేస్తూ అల్లర్లు సృష్టిస్నున వారిని నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు. సర్వాల్, జానీపూర్ ప్రభుత్వ కాలనీల్లో నివసిస్తున్న వారు కూడా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారన్నారు. దాడులకు దిగుతున్న మూకలను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. పుల్వానా ఘటనలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పించామన్నారు. దేశ భద్రతపై రాజీలేకుండా పోరాడేందుకు పోలీసులకు అండగా ఉంటామన్నారు. దేశ భద్రత విషయంలో త్యాగనిరతితో పోరాడుతున్న జవాన్లకు తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.