జాతీయ వార్తలు

‘వందే భారత్’పై రాళ్లతో దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై తుండ్లా జంక్షన్ స్టేషన్ వద్ద బుధవారం రాళ్లతో దాడి చేశారు. రాళ్ళదాడిలో విండోప్యానల్ దెబ్బతిందని అధికారులు వెల్లడించారు. రెండు నెలల వ్యవధిలో రాళ్లదాడి జరగడం ఇది మూడోసారి. ఈనెల 17 నుంచి సెమీ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్‌ను నడుపుతున్నారు. అంతకు ముందు అంటే డిసెంబర్‌లో ఢిల్లీ-ఆగ్రా మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లతో దాడి చేశారు. అదే నెలలో మరోసారి రాళ్లు విసిరారు. మొదటి సారి దాడి జరిగినప్పుడే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. వందే భారత్ తిరిగే మార్గంలో నిఘా పెట్టారు. ఆకతాయి యువకులే ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. తాజాగా బుధవారం తుండ్లా జంక్షన్ దాటక రాళ్లదాడి జరిగిందని ఉత్తర రైల్వే ప్రతినిధి దీపక్ కుమార్ వెల్లడించారు.