జాతీయ వార్తలు

పసికందును బలిగొన్న లంచం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహ్రయిచ్ (యూపీ), ఆగస్టు 11: చికిత్సకోసం తల్లిదండ్రులు లంచం ఇవ్వలేకపోవడమే ఆ పసిబిడ్డకు శాపమైంది. సకాలంలో సరైన చికిత్స అందక యూపీలోని ఓ ప్రభుత్వం ఆసుపత్రిలో పదినెలల బాబు మృత్యువాత పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లో ఈ అమానుషం చోటుచేసుకుంది. జ్వరంతో ఆసుపత్రికి వెళ్లిన బాలుడికి సకాలంలో వైద్య సేవలందించకపోగా, ఏదో ఇంజక్షన్ ఇచ్చి తల్లిదండ్రులకు పుట్టెడు శోకం మిగిల్చారు. దీనిపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో మొత్తం ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. బాలుడు కృష్ణ తండ్రి శివదత్ అందించిన వివరాల ప్రకారం జ్వరంతో బాధపడుతున్న చిన్నారి కృష్ణను ఈ నెల 7న జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు. బాలుడిని కొన్ని రోజులు ఆసుపత్రిలో ఉంచాలని వైద్యుడు చెప్పారు. అయితే వైద్యం చేయడానికి నర్సు లంచం డిమాండ్ చేసింది. రోజుకూలీ శివదత్‌కు డబ్బులు ఇచ్చుకునే స్తోమత లేకపోవడంతో నర్సుకు వంద రూపాయలు ఇచ్చాడు. పిల్లల వార్డులో బెడ్ ఇవ్వడానికి స్వీపర్‌కు 30 రూపాయలు ఇచ్చారు. ఆసుపత్రిలో పేపర్లు నింపాలని వాటికి మరికొంత మొత్తం కావాలని నర్సు డిమాండ్ చేసింది. స్వీపర్ కూడా ఇంకా సొమ్ములు కావాలని వత్తిడి చేశాడు. మొత్తానికి తీవ్ర జ్వరంతో ఉన్న కృష్ణకు సకాలంలో వైద్యం అందించకుండా గడిపేశారు. ఏదో చేశామన్న పేరుతో ఓ ఇంజక్షన్ ఇవ్వడంతో వికటించి పది నెలల చిన్నారి ప్రాణాలు విడిచాడు. తమ కుమారుడుకి వైద్యం చేయమని, డబ్బులు తరువాత ఇస్తామని ఎంత ప్రాధేయపడ్డా కనికరించలేదని తల్లి ఆరోపిస్తోంది.
ఈ వ్యవహారంపై జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఒపి పాండే నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. నర్సు ఆశాసింగ్‌పై విచారణ జరుపుతున్నారు. స్వీపర్‌ను విధుల నుంచి తప్పించినట్టు తెలిపారు. అయితే బాలుడికి యాంటీ బయాటిక్ ఇంజక్షనే ఇచ్చారు తప్ప మరొక ఇంజక్షన్ చేయలేదని పాండే వెల్లడించారు. ఇది దురదృష్టశాత్తూ జరిగిన సంఘటనగా ఆయన చెప్పుకొచ్చారు.