జాతీయ వార్తలు

ఆక్రమిత కాశ్మీర్‌ను వదలండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఆక్రమిత కాశ్మీర్‌లో పాకిస్తాన్ సర్కార్‌కు ప్రజల నుంచి సెగ మొదలైంది. కాశ్మీర్‌పై కాదు ఆక్రమిత కాశ్మీర్‌పైనే ఇక చర్చలంటూ భారత ప్రభుత్వం కరాఖండిగా తేల్చేసిన నేపథ్యంలో ఆజాదీ కాశ్మీర్‌గా పేర్కొంటున్న ఈ ప్రాంత ప్రజలు పాక్ దురాక్రమణపై నిప్పులు చెరుగుతున్నారు. గత నెల 21న జరిగిన ఎన్నికల్లో పూర్తిస్థాయిలో రిగ్గింగ్ జరిగిందని నిరసన వ్యక్తం చేయడమే కాకుండా ఈ ప్రాంతం నుంచి పాకిస్తాన్ వెళ్లిపోవాలని కూడా డిమాండ్ చేశారు. ఆజాదీ నినాదాలతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం మారుమోగిపోయింది. ఉగ్రవాదాన్ని, రౌడీయిజాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోందని ప్రజలు నినాదాలు చేశారు. పాక్ మీడియాపైనా నిప్పులు చెరిగారు. గత నెలలో జరిగిన ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ సారధ్యంలోని పాకిస్తాన్ ముస్లింలీగ్(ఎం) మొత్తం 41 సీట్లకు 38 సీట్టు గెలుచుకుంది. ఎప్పుడు ఆక్రమిత కాశ్మీర్‌లో ఎన్నికలు జరిగినా అధికార పార్టీకి అనుకూలంగా తీర్పు వచ్చేలా వ్యవహారాన్ని నడుపుతారని ప్రజలు ఆరోపించారు. ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు భారత్‌లో అంతర్భాగం గానే ఉండాలన్న ప్రధాన ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారని అంజుమాన్ మిన్హాజ్ ఎ రసూల్ చైర్మన్ వౌలానా సయ్యద్ హుస్సేన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు పాక్ ఉగ్రవాద ధోరణితో విసుగెత్తిపోయారని పేర్కొన్న ఆయన ఈ ప్రాంతంపై రిఫరెండం జరగాలని కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారని ఆయన తెలిపారు.

చిత్రం..కాశ్మీర్‌లో పోలీసు కాల్పులకు నిరసనగా గురువారం శ్రీనగర్‌లో ధర్నా చేస్తున్న ఆందోళనకారులు