జాతీయ వార్తలు

ఉత్తరప్రదేశ్‌లో బిజెపిలోకి వలసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఆగస్టు 11: మరికొన్ని నెలల వ్యవధిలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం ఆశిస్తున్న బిజెపికి అనుకోని వరమే ఎదురైంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమాజ్‌వాది పార్టీసహా కాంగ్రెస్, బిఎస్‌పిలకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు గురువారం బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాగా, ఇద్దరు బిఎస్‌పికి, ఒకరు సమాజ్‌వాది పార్టీకి చెందినవారు. ఈ ఎమ్మెల్యేలందరూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ వౌర్య సమక్షంలోనే ఆ పార్టీలో చేరారు. ఈ మూడు పార్టీలకు చెందిన మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీలో చేరే అవకాశం ఉందని వౌర్య ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలో సమాజ్‌వాది పార్టీ హయాంలో అక్రమ పాలన, గూండాగిరి ఆనవాయితీగా మారిందని, దీనిపైనే తమ పార్టీ పోరాటం చేస్తోందని వౌర్య తెలిపారు. బిఎస్‌పి, సమాజ్‌వాది పార్టీల మూలంగానే రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారుతున్నాయని ఆరోపించారు. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిజెపిలోకి వలసలు రావడం శుభపరిణామమని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయ.