జాతీయ వార్తలు

ఎన్‌ఐటి ఏర్పాటుకు రాష్టప్రతి ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 11: ఆంధ్రప్రదేశ్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటి) ఏర్పాటుకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఎన్‌ఐటి స్థాపనకు అవకాశమిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సైన్స్ ఎడ్యుకేషన్, రీసర్చ్ సవరణ బిల్లుపై ప్రణబ్ సంతకం చేశారు. దీంతోపాటు తిరుపతిలో స్థాపించనున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి)కి కూడా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. ఇందుకు వీలుకల్పించే ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ సవరణ చట్టం-2016పై మంగళవారం ప్రణబ్ సంతకం చేశారని రాష్టప్రతి భవన్ నుంచి ఓ ప్రకటన వెలువడింది. తిరుపతితో పాటుగా దేశవ్యాప్తంగా మరో అయిదు ఐఐటిలకు కూడా రాష్టప్రతి ఆమోదం తెలిపారు. రాష్టప్రతి ఆమోదం తెలిపిన ఐఐటిల్లో జమ్ములో ఒకటి ప్రారంభించనున్నారు. దీంతోపాటు పాలక్కాడ్ (కేరళ) గోవా, ధార్‌వార్డ్ (కర్ణాటక), భిలాయ్ (్ఛత్తీస్‌గఢ్)లలో కూడా ఐఐటిలు ప్రారంభమవుతాయి. వీటితో పాటు ధన్‌బాద్ (జార్ఖండ్)లో ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ (ఐఎస్‌ఎం) ఏర్పాటుకు కూడా చట్టంలో అంగీకారం తెలిపారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సవరణ బిల్లును లోక్‌సభ జూలై 25న, రాజ్యసభ ఆగస్టు 2న ఆమోదించిన సంగతి తెలిసిందే.