జాతీయ వార్తలు

ఆ తీర్పులో మార్పు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగష్టు 11: ఉమ్మడి ఉన్నత విద్యామండలి ఆస్తుల పంపకాలపై ఇటీవల ఇచ్చిన తీర్పును పున:పరిశీలించాలంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ ఏడాది మార్చి 18న ఉమ్మడి ఉన్నత విద్యామండలి ఆస్తుల పంపకాలపై తీర్పు ఇవ్వటం తెలిసిందే. ఈ తీర్పును పున:పరిశీలించాలంటూ తెలంగాణా సర్కారు సుప్రీం కోర్టులో ఏప్రిల్ 18 నాడు రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ గోపాల గౌడ, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి కేసులో గతంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చుతూ.. సుప్రీంకోర్టు 58:42 జనాభా నిష్పత్తిలో ఆస్తులను పంచుకోవాలని మార్చి 18 తీర్పు వెలువరించింది. అలాగే దీనికి సంబంధించిన సమస్యలు ఉంటే రెండు నెలలలో కేంద్రం పరిష్కరించాలని ధర్మాసనం ఆదేశించిది. ఆ తీర్పులో ఏపీ ఉన్నత విద్యామండలి ఆస్తులు తమకే చెందుతాయన్న తెలంగాణ రాష్ట్ర వాదనను కోర్టు తోసిపుచ్చింది. విభజన తర్వాత ఆస్తులు అప్పులు ఇరు రాష్ట్రాలకు పంచాలని సూచించింది. ఇరు రాష్ట్రాల మధ్య పంపకాలు జరగనట్లయితే సెక్షన్ 45 నిరుపయోగం అవుతుందని ఆ తీర్పులో పేర్కొంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పంపకాలు తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు ధర్మాసనం తిరస్కరించింది. అదేవిధంగా గతంలో ఢిల్లీలో హోంశాఖ కార్యాలయంలో రెండు రాష్ట్రాల అధికారులతో రెండు దఫాలుగా నిర్వహించింది. ఈ సమావేశాల్లోనూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని కేంద్రానికి తెలిపింది.