జాతీయ వార్తలు

ఇప్పుడేం చేద్దాం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 11: ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ తీసుకునే అంశంపై తెలుగుదేశం పార్టీలో తీవ్ర స్థాయి విభేదాలు నెలకొన్నాయి. పార్టీకి చెందిన సీనియర్ నేతలు కొందరు ప్రత్యేక ప్యాకేజీ తీసుకుని ఈ సమస్యకు తెరదించాలని ఆలోచిస్తుంటే, మరి కొందరు మాత్రం ప్రత్యేక హోదా సాధించుకోవలసిందే తప్ప ప్యాకేజీతో రాజీ కూడదని పట్టుపడుతున్నారు. కేంద్ర సైన్సు, టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి, రాజ్యసభ సభ్యుడు సి.ఎం.రమేష్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీతో చర్చలు జరుపుతున్నారు. కేంద్ర సమాచార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఈ చర్చల్లో కీలక పాత్ర నిర్వహిస్తుంటే బిజెపి లోక్‌సభ సభ్యుడు హరిబాబు కూడా ఈ చర్చల ప్రక్రియలో పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం పధ్నాలుగో ఆర్థిక సంఘం సిఫారసులు, ఇతర రాష్ట్రాల డిమాండ్‌ల మూలంగా ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యం కాదని చెప్పటం తెలిసిందే. హోదా స్థానంలో ప్రత్యేక ఆర్థిక సహాయం చేస్తామని అరుణ్‌జైట్లీ చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్యాకేజీ పేరుతో ఆంధ్రాకు అందజేయవలసిన సహాయంపై మంతనాలు జరుపుతున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యం కాని పక్షంలో ప్రత్యేక ఆర్థిక సహాయం తీసుకోవటం ద్వారా ఈ అంశానికి తెరదించాలని తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నాయకులు భావిస్తున్నారు. హోదా వల్ల ఎంతైతే ప్రయోజనం కలుగుతోందో అంతే ప్రయోజనం ప్రత్యేక సహాయం ద్వారా లభిస్తే ఎందుకు తీసుకోకూడదన్నది వారి వాదన. జమ్ముకాశ్మీర్ అపిల్ పండు ఇవ్వటం సాధ్యం కాని పక్షంలో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన రెండు ఆపిల్ పండ్లు తీసుకోవటంలో తప్పు లేదు కదా? అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. అయితే మరికొందరు దేశం ఎంపిలు మాత్రం ఈ వాదనతో ఏకీభవించటం లేదు. ప్రత్యేక హోదాతో రాజీపడటం తెలుగుదేశం పార్టీకి ఎంతమాత్రం మంచిది కాదని వారంటున్నారు. ప్రత్యేక హోదాకు బదులు మరే ఇతర సహాయం తీసుకున్నా రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురై ఓటమిని ఎదుర్కోవలసి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హోదా భావోద్వేగంతో కూడుకున్న అంశంగా మారిందంటున్నారు. ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక హోదా సాధన కోసం కృషి చేయాలని అభిప్రాయపడుతున్నారు. హోదా విషయంలో ఎలాంటి రాజీ పడినా పరిస్థితులు తీవ్రంగా మారుతాయని వారు హెచ్చరిస్తున్నారు. హోదా విషయంలో రాజీ పడితే రాజకీయంగా దెబ్బతింటామన్నది వారి భయం. ఎన్‌డిఏ ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయం పేరుతో రానున్న ఐదేళ్లలో పది వేల కోట్లకంటే ఎక్కువ నిధులు ఇవ్వలేదని వారు చెబుతున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే మనం ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టుకోవటం ఏవిధంగా మంచిదని ప్రశ్నిస్తున్నారు. ఎన్‌డిఏ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వని పక్షంలో ప్రభుత్వం నుండి తప్పుకోవాలి, బిజెపితో తెగతెంపులు చేసుకోవటం మంచిదని పలువురు తెలుగుదేశం ఎంపిలు అభిప్రాయపడుతున్నారు.