జాతీయ వార్తలు

మా గురించి మాట్లాడలేదేం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 15: న్యాయమూర్తుల నియామకం అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రస్తావించక పోవడం పట్ల సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘గంటన్నర పాటు మోదీ ప్రసంగాన్ని విన్నాను. న్యాయ వ్యవస్థ గురించి, న్యాయమూర్తుల నియామకం గురించి ప్రస్తావిస్తారని ఆశించాను’అని సోమవారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ఠాకూర్ అన్నారు. పేదరికాన్ని తొలగించడం, ఉపాధి కల్పించడం, పథకాలను చేపట్టడం వంటి ఎన్ని చర్యలు చేపట్టినా దేశ ప్రజలకు న్యాయాన్ని అందించే అంశంపైనా దృష్టి పెట్టాలని ప్రధానిని కోరుతున్నానన్నారు. హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల నియామకం, బదిలీలపై కొలీజియం చేసిన సిఫార్సులను అమలు చేయక పోవడంపై సుప్రీం కోర్టు ఇటీవల కేంద్రాన్ని తీవ్ర స్వరంతో విమర్శించిన నేపథ్యంలో చీఫ్ జస్టీస్ చేసిన ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. కోర్టులపై పనిభారంర పెరిగిపోయిందని, త్వరిత గతిన పాలన జరగడం సాధ్యం కావడం లేదని ఠాకూర్ అన్నారు. బ్రిటీష్ కాలంలో కేసుల పరిష్కారానికి పదేళ్లు పట్టేదని, కానీ ప్రస్తుతం సత్వర న్యాయపాలన అవసరం పెరిగిందన్నారు. దీన్నిదృష్టిలో పెట్టుకునే న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ప్రధానిని ఎన్నోసార్లు అభ్యర్థించానన్నారు.