జాతీయ వార్తలు

ఓ తండ్రిని కోల్పోయాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారంగ్‌పూర్ (గుజరాత్), ఆగస్టు 15: బొచ్చసన్వాసి అక్షర్ పురుషోత్తం సంస్థాన్ (బిఎపిఎస్) స్వామినారాయణ్ సంస్థ అధిపతి ప్రముఖ్ స్వామి మహరాజ్ కాలధర్మంతో తాను తండ్రిలాంటి వ్యక్తిని కోల్పోయానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శనివారం కాలధర్మం చేసిన ప్రముఖ్ స్వామి భౌతికకాయాన్ని భక్తులు, ప్రజల చివరి దర్శనం కోసం ఇక్కడి ఆలయం వద్ద ఉంచారు. ఈ నెల 17వరకు భౌతికకాయాన్ని ఇక్కడే ఉంచుతారు. ప్రధాని మోదీ శనివారం ఇక్కడికి వచ్చి ప్రముఖ్ స్వామి భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సుమారు 20 నిమిషాల సేపు మాట్లాడిన మోదీ ప్రముఖ్ స్వామితో తనకు ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ రెండు సార్లు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘మీలో చాలామంది ఒక గురువును కోల్పోయి ఉండవచ్చు. కాని, నేను ఒక తండ్రిని కోల్పోయాను’ అని మోదీ గద్గద స్వరంతో అన్నారు. ఉబికి వస్తున్న భావోద్వేగాల నుంచి నిభాయించుకోవడానికి మోదీ సుమారు నిమిషం సేపు ప్రసంగం మధ్యలో ఆగిపోయారు. ‘మహత్వం, దైవత్వాల మేలు కలయిక ప్రముఖ్ స్వామి మహరాజ్’ అని ఆయన కొనియాడారు. ప్రజాజీవితంలోకి రాకముందు నుంచే తనకు స్వామి తెలుసని చెప్పారు. ప్రముఖ్ స్వామి ‘సాధు’ సంస్కృతిలో సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు.

చిత్రం.. ప్రముఖ్ స్వామి భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ