జాతీయ వార్తలు

ఝండా ఊంచా రహే హమారా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 15: ఆసేతుహిమాచలం డెబ్భై ఏళ్ల స్వాతంత్య్రాన్ని అపూర్వంగా జరుపుకుంది. వినీలాకాశంలో రెపరెపలాడిన ఏడు పదుల మువ్వనె్నల ఝండాకు సమస్త భారతావని సగౌరవ వందనం సమర్పించింది. అన్ని రాష్ట్రాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యా సంస్థల్లో, అత్యంత ఎతె్తైన హిమనదం సియాచిన్ గ్లేసియర్ నుంచి హిందూ మహాసముద్రం దాకా అన్ని చోట్లా ఆకాశం త్రివర్ణమైంది. ప్రతి పౌరుడిలో దేశభక్తి తొణికిసలాడింది. అశోకుడి ధర్మచక్రం యావత్ దేశాన్ని సుదర్శన చక్రంలా రక్షాకవచమై ఆవరించింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఛత్రసాల్ స్టేడియంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పతాకావిష్కరణ చేసి ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కావాలని డిమాండ్ చేశారు. ‘1935, గవర్నమెంట్ ఇండియా యాక్ట్’ ప్రకారమే ఇప్పటికీ ఢిల్లీలో పాలన జరుగుతోందని ఆయన వాపోయారు. జమ్ముకశ్మీర్‌లో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ భావోద్వేగంతో మాట్లాడారు. కొందరు స్వార్థపరులు తమ ప్రయోజనాల కోసం రెచ్చగొడితే వారి మాయలో పడిపోవద్దని కాశ్మీరీ యువకులకు పిలుపునిచ్చారు. మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజపేయి మార్గంలోనే కాశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుగొనాలని కోరారు. అస్సాంలో ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ పతాకావిష్కరణ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలోనే అయిదో అత్యున్నత రాష్ట్రంగా మార్చాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. మిజోరాంలో ముఖ్యమంత్రి లాల్‌థన్‌వాలా, అరుణాచల్ ప్రదేశ్‌లో పెమా ఖండూ పతాకాన్ని ఆవిష్కరించారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కోల్‌కతాలోని రెడ్‌రోడ్‌లో స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. త్రిపురలో ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ జండావందన కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేస్తూ వచ్చే మూడేళ్లలో విద్యుత్ సౌకర్యాల కోసం రూ.9వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. 2022నాటికి 22వేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పతి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలిత ప్రసంగిస్తూ అతిముఖ్యమైన రంగాల్లో అభివృద్ధిని వేగంగా సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆహారధాన్యాల ఉత్పత్తి నిరుటితో పోలిస్తే 44.8శాతం పెరిగిందన్నారు. ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. సైబర్ క్రైం తగ్గించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య పతాకాన్ని ఆవిష్కరించారు. దేశంలో దళితులపై దాడులు ఇప్పటికీ కొనసాగటం సిగ్గుచేటని ఆయన ఈ సందర్భంగా అన్నారు. కేరళలో పినరాయి విజయన్ పతాకావిష్కరణ సందర్భంగా రాష్ట్రం నుంచి ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరేందుకు వెళ్తున్న యువకులను హెచ్చరించారు. యువకుల్లో ఉండే ఆధ్యాత్మిక, మతపరమైన నమ్మకాలను యువకులను తమవైపు తిప్పుకోవటానికి ఉగ్రమూకలు ప్రయత్నిస్తున్నాయన్నారు. బీహార్‌లో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి ఏడు తీర్మానాలను ఆమోదిస్తున్నట్లు స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో పేర్కొన్నారు. జార్ఖండ్, హర్యానా, చండీగఢ్, ఒడిషా రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు పతాకావిష్కరణ చేశారు.

చిత్రం.. తమిళనాడులోని కోయంబత్తూరులో రెపరెపలాడుతున్న జెండాతో ఓ బాలుడు