జాతీయ వార్తలు

జీఎస్‌టికి బీహర్ జై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, ఆగస్టు 16: జిఎస్‌టి బిల్లును ఆమోదించిన తొలి బిజేపీ యేతర ప్రభుత్వంగా బీహర్ నిలిచింది. వర్షాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ఆమోదించిన వస్తుసేవల పన్ను బిల్లును బీహార్ ఆసెంబ్లీ రాటిఫై చేసింది. 1991 తరువాత అత్యంత కీలకమైన ఆర్థిక సంస్కరణగా మారిన జిఎస్‌టి బిల్లును దేశంలోని 50శాతం రాష్ట్రాలు కనీసంగా ఆమోదించాల్సి ఉంది. శాసనసభలో అధికార జెడియు, ఆర్జేడీ, ప్రతిపక్ష బిజెపిలు బిల్లుకు అనుకూలంగా ఓటేయగా, సిపిఐ ఎంఎల్ ఎమ్మెల్యే మెహబూబ్ ఆలమ్ బిల్లును వ్యతిరేకించారు. ఈ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ. ఆలం ఒక్కరే సభకు హాజరయ్యారు. జి ఎస్‌టి బిల్లును ఇప్పటికే అస్సాం అసెంబ్లీ ఆమోదించగా, బీహార్ రెండో రాష్ట్రంగా నిలిచింది.