జాతీయ వార్తలు

జీ.. అంటే మోదీకి గుబులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ‘మన ప్రధాని మోదీ బలహీనుడు.. అందుకే ఆయన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు భయపడ్డారు’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే విషయంలో ఐక్యరాజ్య సమితి భద్రతామండలి తీర్మానాన్ని మరోసారి చైనా అడ్డుకోవడాన్ని ఆయన ప్రస్తావిస్తూ చైనా చర్యపై ప్రధాని మోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. ‘ఈ విషయంలో మన బలహీన ప్రధాని మోదీ భయపడ్డారు. అందుకే ఆయన నోరుతెరచి వారిని ఒక్కమాట కూడా అనలేకపోయారు’ అని విమర్శించారు. చాలాసార్లు ఆ దేశంతో దౌత్య సంబంధాలు అంటూ తిరిగిన ప్రధాని ఆ దేశం ఇలా చేస్తుంటే ఏమీ చేయలేకపోయారని విమర్శిస్తూ చైనాపై నరేంద్రమోదీ దౌత్యపరమైన వ్యవహారాలు ఇలా ఉన్నాయంటూ పేర్కొన్నారు. 1. గుజరాత్‌లో జింగ్‌తో కలిసి తిరుగుతారు. 2. ఢిల్లీలో జింగ్‌ను ఆలింగనం చేసుకుంటారు 3. చైనాలో జింగ్‌కు తల వంచుతారు. అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో మసూద్ అజర్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించే విషయంలో చైనాదేశం మరోసారి తన వీటో అధికారంతో పాకిస్తాన్‌కు అండగా నిలిచి అజర్‌ను ఉగ్రవాదిగా ముద్ర వేయకుండా అడ్డుకుంది. 44 మంది సీఆర్‌పిఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న అజర్ లాంటి కరడుగట్టిన తీవ్రవాది విషయంలో చైనా బహిరంగంగా ఇలా వ్యవహరించిందంటే ఇక మోదీ ఆ దేశ అధ్యక్షుడితో ఇప్పటివరకు జరిపిన దౌత్యపర వ్యవహారాలు ఏమైపోయినట్టని కాంగ్రెస్ తన అధికార ట్విటర్‌లో ప్రశ్నించింది. ఇంత ఘాతుకానికి ఒడిగట్టిన ఉగ్రవాదిని అలాగే వదిలేద్దామని బీజేపీ ప్రభుత్వం భావిస్తోందా? అని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా అన్నారు. మోదీ విదేశాంగ విధానం పూర్తిగా విఫలమైనట్టు ఈ చర్యతో వెల్లడవుతోందని విమర్శించారు. ఖాందహార్ హైజాకింగ్ కేసులో 1999లో మసూద్ అజార్‌ను వదిలిపెట్టినప్పుడు బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉందని, దీనిపై మోదీ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న అజిత్ దోవల్ అప్పట్లో అజార్‌ను వెంటబెట్టుకుని వెళ్లి మరీ ఉగ్రవాదులకు అప్పగించారని ఆయన విమర్శించారు.