జాతీయ వార్తలు

ప్రజా ఉద్యమంలా స్వచ్ఛ్భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 16: స్వచ్ఛ్భారత్ మిషన్ ప్రజా ఉద్యమంగా మారుతోందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. మంగళవారంనాడు ఢిల్లీలో స్వచ్ఛ్భారత్‌లో ‘‘ప్రజల భాగస్వామ్యం -ప్రజా ఉద్యమం’’ వర్క్‌షాప్‌ను వెంకయ్య ప్రారంభించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు నూతన పద్ధతులపై ఈ వర్క్‌షాప్‌లో చర్చిస్తామని అన్నారు. అలాగే ఈ వర్క్‌షాప్‌లో చేసిన సిఫార్సులను ప్రభుత్వం ప్రజల ముందు ఉంచుతామన్నారు. స్వచ్ఛ్భారత్ మిషన్‌లో ముఖ్యంగా వౌలిక సదుపాయాల కల్పన, పరిశుభ్రతకు పాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాలలో బయట పరిసరాలలో చేత్తవేసేవారిపై జరిమానా విధించే అంశం పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దేశ భద్రత విషయంలో అన్ని పార్టీలు ఒకే గొంతుకతో వ్యవహరించాలని, కాని కాంగ్రెస్ తీరు బాధాకరమని పేర్కొన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ బెలూచిస్తాన్‌లో హక్కుల ఉల్లంఘన వ్యవహారం ప్రపంచానికి తెలియాలన్నారు.