జాతీయ వార్తలు

బ్రస్సెల్స్ తరహా దాడి జరిగితే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 16: భారత విమానాశ్రయాల్లో భద్రతా పరిస్థితులు ఆందోళన కరంగా ఉన్నాయని ఇంటిలిజెన్స్ బ్యూరో తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. బ్రస్సెల్స్ తరహాలో ఉగ్రవాద దాడి జరిగితే పరిస్థితి ఏమిటంటూ హెచ్చరికలు జారీ చేసింది. సరైన పరిమాణంలో నిధులులేకపోవడం వల్ల దేశవ్యాప్తంగా 24 విమానాశ్రయాల్లో సిఐఎస్‌ఎఫ్ ప్రత్యేక భద్రత కొరవడిన నేపథ్యంలో ఇంటిలిజెన్స్ బ్యూరో ఈ హెచ్చరిక జారీ చేయడం గమనార్హం. దేశంలోని విమానాశ్రయాల్లో భద్రతాపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామో పరిశీలించాలని హోమ్ మంత్రిత్వశాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నివేదికను త్వరలోనే సిఐఎస్‌ఎఫ్, బిసిఐఎస్ వంటి భద్రతా ఏజెన్సీలతో కూడిన బహుళ సభ్యత్వ కమిటీకి అందిస్తారు. దేశంలోని విమానాశ్రయాలు అన్నింటికీ పౌరవిమానయాన ప్రత్యేక భద్రతాదళాన్ని ఏర్పాటు చేయాలన్న పౌరవిమానయాన మంత్రిత్వశాఖ ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించింది. అయితే ఈ రక్షణ, భద్రత బాధ్యతను సిఐఎస్‌ఎఫ్‌కే అప్పగించాలని సూచించింది. ప్రస్తుతం 27 విమానాశ్రయాల్లో భద్రతా విధులను సిఆర్‌పిఎఫ్, భారత రిజర్వ్ బెటాలియన్లు లేదా రాష్టప్రోలీసులే నిర్వహిస్తున్నారు. దీని దృష్ట్యా సిఐఎస్‌ఎఫ్ మోహరింపునకు ఆస్కారం లేకుండాపోయింది.