జాతీయ వార్తలు

మరింత బలంగా మైత్రీబంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 16: హిందూ మహాసముద్ర ప్రాంతంలో శాంతి పరిరక్షణకు సంయుక్తంగా కృషి చేయాలని భారత్, మాల్దీవులు నిర్ణయించాయి. ఈ ప్రాంతంలో తన ఉనికిని చాటుకునేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వ్యూహాత్మక అంశాలపై భారత్ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో మాల్దీవులు విదేశాంగ మంత్రి మహ్మద్ ఆసిమ్ చర్చించారు. వీరిద్దిరి మధ్యా అనేక అంశాలపై మంగళవారం చర్చలు జరిగాయి. వచ్చేనెలలో జరగనున్న కామనె్వల్త్ దేశాల మంత్రుల స్థాయి కార్యాచరణ బృందం సమావేశంపై వీరిద్దరూ చర్చించారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేసుకోవాలని సంకల్పించారు. అలాగే భారత దేశమే తన తొలి ప్రాధాన్యత అన్న అంశాన్ని ఆసిమ్ చాటిచెప్పారు. ఇరుగుపొరుగుదేశాలు అన్నింటితోనూ సత్సంబంధాలు కలిగి ఉండాలని అలాగే ఆర్థికవృద్ధి, అభివృద్ధిలో ఈ దేశాలన్నీ ప్రయోజనం పొందాలన్న ప్రధాని మోదీ ఆకాంక్షను సుష్మా స్వరాజ్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఈ చర్చల వివరాలను విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ వెల్లడించారు.