జాతీయ వార్తలు

అల్లర్లకు నిధుల ఆజ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 16: కాశ్మీర్‌లో గత మూడు వారాలుగా ఎడతెగని రీతిలో జరుగుతున్న అల్లర్ల వెనుక సీమాంతర నిధుల ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ అల్లర్లకు సారథ్యం వహిస్తున్న జమాతే ఇస్లామీ, దుక్‌త్రానన్ ఎ మిలత్ మిలిటెంట్ సంస్థలకు ఇప్పటి వరకూ 24 కోట్ల రూపాయలు అందినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ వేర్పాటు గ్రూపులకు అనుబంధంగా ఉన్న కాశ్మీర్ మిలిటెంట్ సంస్థలకు ఈ నిధులు అందుతున్న విషయాన్ని ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరించాయి. అన్ని వైపుల నుంచి నిధులు అందుతున్న దృష్ట్యా ఈ అల్లర్లు ఇప్పట్లో సద్దుమణిగే అవకాశం కనిపించడం లేదన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశాయి. కాశ్మీర్ లోయకు చెందిన యువతకు నిధులు ముట్టచెబుతున్నారని, దాని కారణంగానే వీధుల్లోకి వచ్చి అల్లర్లు సృష్టిస్తూ భద్రతా దళాలపై దాడులకు తెగబడుతున్నారని కూడా వెల్లడించాయి. బూర్హన్ వని హతుడైనప్పటి నుంచి కాశ్మీర్‌లో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయ. వీటి వెనుక పాకిస్తాన్ హస్తం స్పష్టంగా ఉన్నట్టు భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. తాజాగా తలెత్తిన హింసాకాండ నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌తో మంగళవారం భేటీ అయ్యారు.