జాతీయ వార్తలు

భారత్ వ్యతిరేక నినాదాలివ్వలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగలూరు, ఆగస్టు 16: కాశ్మీర్‌పై బెంగలూరులో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఉద్యోగుల్లో కొందరు భారత వ్యతిరేక నినాదాలు చేశారంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ చేసిన ఆరోపణలను ఆ సంస్థ మంగళవారం ఖండించింది. తమ ఉద్యోగులెవరూ కూడా భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని ఆ సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే తమ ఉద్యోగులపై రాజద్రోహ అభియోగాలు నమోదు చేశారని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్పష్టం చేసింది. జమ్మూకాశ్మీర్‌లో కొంతకాలంగా జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై మాత్రమే గత శనివారం ఓ కార్యక్రమం నిర్వహించామని, తమ ఉద్యోగుల్లో ఏ ఒక్కరూ, ఏ దశలోనూ భారత వ్యతిరేక నినాదాలు చేయనేలేదని స్పష్టం చేశారు. హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన అంశాలపై తరచూ చర్చలు, సదస్సులు జరుగుతూనే ఉంటాయని సంస్థ పేర్కొంది. కాగా ఏబివిపి మాత్రం అమ్నెస్టీ ఇంటర్నేషనల్ నిర్వహించిన ఈ సదస్సులో కాశ్మీర్ పాకిస్తాన్‌లో అంతర్భాగం కావాలంటూ నినాదాలు చేసినట్లు ఆరోపణ చేసింది. అమ్నెస్టీ వ్యవహారాన్ని నిరసిస్తూ ఏబివిపి బెంగళూరులో నిరసన ప్రదర్శనలు చేశారు. సదరు స్వచ్ఛంద సంస్థకు చెందిన భారత విభాగం ఉద్యోగులు దేశ వ్యతిరేక నినాదాలు చేశారని, వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. నిరసన ప్రదర్శన సందర్భంగా ఏబివిపి కార్యకర్తలు, పోలీసుల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది.
అమ్నెస్టీపై కేసు నమోదు
ఏబివిపి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌పై పోలీసులు 124(ఏ), 142, 143, 147. 153 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర తెలిపారు. నినాదాలు చేసిన వారిని గుర్తించేందుకు పోలీసులు సిసి టివి ఫుటేజిని పరిశీలిస్తున్నారని ఆయన వివరించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా స్పందించారు. పోలీసులు విచారణ జరుపుతున్నారని, దోషులెవరినీ వదిలేది లేదని స్పష్టం చేశారు.

చిత్రం..బెంగలూరులో మంగళవారం ర్యాలీ నిర్వహిస్తున్న ఎబివిపి కార్యకర్తలను తరిమికొడుతున్న పోలీసులు