జాతీయ వార్తలు

పాకిస్తాన్ ఓ నరకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెవారీ (హర్యానా), ఆగస్టు 16: దాయాది దేశంతో సత్సంబంధాలు పూర్తిగా బలహీనపడుతున్న నేపథ్యంలో రక్షణమంత్రి మనోహర్ పారికర్ పాకిస్తాన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్తాన్‌ను ఓ నరకంగా అభివర్ణించారు. బలోచిస్తాన్‌లో తక్షణం మానవ హక్కుల ఉల్లంఘనను చర్యలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. సోమవారం పాకిస్తాన్ చొరబాటు చర్యల్ని భారత సైన్యం నిర్ద్వంద్వంగా నిరోధించగలిగిందని అన్నారు. ‘సోమవారం మన సైనికులు అయిదురు ఉగ్రవాదులను వెనక్కి పంపించారు. పాకిస్తాన్‌కు వెళ్లటం, నరకానికి వెళ్లటం ఒకటే’ అని పారికర్ అన్నారు. అంతేకాదు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పంద్రాగస్టు ప్రసంగానికి బలూచిస్తాన్, గిల్గిత్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు కృతజ్ఞతలు వ్యక్తం చేశారని అన్నారు.

చిత్రం.. హర్యానాలోని రెవారీలో మంగళవారం నిర్వహించిన తిరంగా యాత్రలో పాల్గొన్న రక్షణమంత్రి మనోహర్ పారికర్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ తదితరులు