జాతీయ వార్తలు

నాలుగు రాష్ట్రాలకూ నదీ జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 16: దేశంలో రాష్ట్రాలకు రాజకీయ సరిహద్దులు ఉంటాయిగానీ, నదుల సరిహద్దుల్లో మార్పులుండవని బ్రిజేష్‌కుమార్ ట్రిబున్యల్‌కు ఆంధ్ర స్పష్టం చేసింది. కృష్ణా జలాల వివాదంపై మంగళవారం ఏపీ సుదీర్ఘ వాదనలు వినిపిస్తూ, పుట్టుకనుంచి సముద్రంలో కలిసేవరకు నదిని ఒకే యూనిట్‌గా పరిగణించాలని కోరింది. కృష్ణా జలాల విషయంలో అందరికీ న్యాయం జరగాలంటే ప్రాజెక్టులవారీ నీటి కేటాయింపులు ఒక్కటే మార్గమని సూచించింది. మిగిలిన రాష్ట్రాల విభజన చట్టాలకూ, ఏపీ విభజన చట్టానికి తేడా ఉందని వాదిస్తూ, అందుకోసమే విభజన చట్టంలో సెక్షన్ 89 ఏర్పాటైందన్న విషయాన్ని ట్రిబ్యునల్ గుర్తించాలని, ఆ సెక్షన్ స్ఫూర్తికి భంగంవాటిల్లేలా నిర్ణయాలు తీసుకోకూడదని పేర్కొంది. ఆంధ్ర తరపున సీనియర్ న్యాయవాది ఎకె గంగులీ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపిస్తూ గతంలో కొత్త రాష్ట్రాలు ఏర్పాటైనప్పుడు వాటి పునర్వ్యవస్థీకరణ చట్టాల్లోనే జలాల కేటాయింపులను కేంద్రం స్పష్టంగా పేర్కొన్నదని గుర్తు చేశారు. అయితే ఏపీ విభజన చట్టంలో జలాల కేటాయింపులు జరగనందునే సెక్షన్ 89ను ప్రత్యేకంగా పేర్కొన్నారని వాదించారు. ఎగువ రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు, వాటికింద జలాల నిల్వ, నదినుంచి లభ్యమవుతున్న మొత్తం నీరు తదితరాలను పరిగణనలోకి తీసుకుంటేనే ప్రాజెక్టులవారీ నీటి కేటాయింపులు సాధ్యమని స్పష్టం చేసింది. కృష్ణా నదీ జలాలను నాలుగు రాష్ట్రాల మధ్య కేటాయింపులు జరపాలని ఏపీ మరోసారి ట్రిబ్యునల్‌కు ఉద్ఘాటించింది. రాష్ట్రాలు కొత్తగా ఏర్పడవచ్చు. వాటి సరిహద్దుల్లో మార్పులు చోటుచేసుకోవచ్చు. భవిష్యత్‌లోనైనా మార్పులు సంభవించొచ్చు. కానీ కృష్ణా విస్తీర్ణం లేదా సరిహద్దుల్లో మాత్రం ఎలాంటి మార్పులుండవని పేర్కొంది. ఆంధ్ర, తెలంగాణ మధ్యే నీటి పంపకాలు చేపట్టాలన్న ఆలోచనే ఆనాడు పార్లమెంట్ లేదా కేంద్రానికి ఉండివుంటే, ప్రత్యేకంగా సెక్షన్ 89ను పెట్టేదే కాదన్నారు. ఆస్తులు, అప్పుల పంపకానికి పొందుపర్చిన సెక్షన్ల్‌లోనే కృష్ణా నీటి అంశాన్ని కూడా పెట్టి ఉండేవారని వాదించింది. అలాకాకుండా విభజన చట్టంలోని సెక్షన్ 89ను ప్రత్యేకంగా పెట్టిన ఉద్దేశం నాలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు, నది, దాని పరీవాహక ప్రాంతం, నీటి లభ్యతను అధ్యయనం చేసి ప్రాజెక్టులకు నిర్ధుష్టంగా కేటాయింపుల చేసే ఉద్దేశమేనన్నారు. కేవలం ప్రాజెక్టులవారీ నీటి కేటాయింపులు చేయడం మాత్రమేకాకుండా, నీటి ప్రవాహం, లభ్యత తక్కువగా ఉన్నప్పుడు నాలుగు రాష్ట్రాలకు జలాలను ఏవిధంగా వినియోగించుకోవాలో తెలిపే ఆపరేషన్ ప్రోటోకాల్‌ను కూడ ట్రిబ్యునల్ నిర్ణయించాలని ఏపీ వాదించింది. భవిష్యత్‌లో ఇలాంటి వివాదాలు తలెత్తకుండా ఉండాలంటే, విభజన చట్టంలోని సెక్షన్ 89 స్ఫూర్తిగా ప్రాజెక్టులవారీ కేటాయింపులతోపాటు ఆపరేషన్ ప్రొటోకాల్‌ను ట్రిబ్యునల్ నిర్ణయించాలన్నారు. అలాగే నీటి లభ్యత తక్కువగా ఉన్న సమయంలో జలాల పంపిణీకి అనుసరించాల్సిన ఫార్ములానూ పేర్కొనాలని ఏపీ వాదించింది. ట్రిబ్యునల్ చేసిన నిర్ణయాల ఆధారంగా నీటి వినియోగం, విడుదల తదితరాలపై నదీ నిర్వహణ బోర్డు పర్యవేక్షణ చేస్తుందన్నారు. అలాగే ఏదైనా రాష్ట్రం ఉల్లంఘనలకు పాల్పడితే, దానిపై ఏవిధంగా వ్యవహరించాలన్నదీ బోర్టు చూసుకోవాలని పునర్వ్యవస్థీకరణ చట్టంలోనే ఉందని గుర్తు చేశారు. బుధవారం ట్రిబ్యునల్ ఎదుట మహారాష్ట్ర వాదనలు వినిపించనుంది.