జాతీయ వార్తలు

విశ్వనాథ గోపాలకృష్ణ శాస్ర్తీకి రాష్టప్రతి పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 16: సంస్కృత భాషకు చేసిన సేవలకు గుర్తింపుగా రాజమహేంద్రవరం నగరానికి చెందిన మహామహోపాధ్యాయ, శాస్తన్రిధి విశ్వనాథ గోపాలకృష్ణశాస్ర్తీ రాష్టప్రతి పురస్కారానికి ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా 15 మందికి ఈ పురస్కారాలు ప్రకటించగా, రాష్ట్రం నుంచి విశ్వనాథ ఒక్కరే ఈగౌరవాన్ని పొంద డం విశేషం. విశ్వనాథ గోపాలకృష్ణ తండ్రి జగన్నాథ ఘనాపాఠి కూడా రాష్టప్రతి పురస్కారాన్ని పొందడం విశేషం. దీంతో తండ్రీ తనయులిద్దరూ రాష్టప్రతి పురస్కారానికి ఎంపికైన వారిగా గుర్తింపు పొందారు. రాజమహేంద్రవరంలోనే పుట్టిపెరిగిన విశ్వనాథ గోపాలకృష్ణ శృంగేరి పీఠం నుంచి దర్శనాలంకార బిరుదును పొందారు. అలాగే విద్యావాచస్పతి, అద్వైత వేదాంత సామ్రాట్ బిరుదులను పొందారు. తద్వారా తండ్రికి తగిన తనయుడిగా విశ్వనాథ గోపాలకృష్ణశాస్ర్తీ నిలిచారు.