జాతీయ వార్తలు

పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాల ఎదురీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కొతా, మార్చి 20: పశ్చిమబెంగాల్‌ను మూడుదశాబ్దాలకు పైబడి పాలించిన సీపీఎం కూటమి ఈ రోజు తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. తన సత్తాను చాటేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికలు వామపక్ష పార్టీలకు సవాలుగా పరిణమించాయి. 1977 నుంచి 2011 వరకు ఏకచత్రాధిపత్యంగా పాలించిన ఎర్ర జెండా పార్టీలు ఈ రోజు కళతప్పాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్‌ను మట్టికరిపించేందుకు బీజేపీ దూసుకుపోతోంది. ఇటీవల కాలంలో బీజేపీ రాష్ట్రంలో బలం పుంజుకుంది. వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ నుంచి పెద్దఎత్తున ఓటర్లు బీజేపీవైపు మరలుతున్నారు. టీఎంసీకి ఓటు వేయడానికి ఇష్టపడని ఓటర్లు ప్రత్యామ్నాయంగా బీజేపీని చూస్తున్నారు. ‘నిజంగా మాకు ఇవి చాలా సంక్లిష్టమైన ఎన్నికలు.. ఈ ఎన్నికల్లో గట్టెక్కేందుకు ప్రయత్నిస్తున్నాం.. ఒంటరిగా వామపక్ష పార్టీలు పోటీకి దిగాయి.. కాంగ్రెస్ పొత్తు కూడా లేదు’ అని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు హన్నన్ మొల్లా చెప్పారు. రాజకీయంగా తమ ఆధిపత్యాన్ని చాటాలంటే టీఎంసీతోపాటు బీజేపీతో కూడా పోరాడాల్సి వస్తోంది. సీపీఎం కూటమిలో మొత్తం పది వరకు వామపక్ష పార్టీలున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు కేవలం రెండే రెండు సీట్లలో గెలిచాయి. కాంగ్రెస్‌తో పొత్తుకోసం వామపక్షాలు తీవ్రంగా ప్రయత్నించి భంగపడ్డాయి. కాంగ్రెస్, వామపక్ష పార్టీలు విడివిడిగానే ఎన్నికల బరిలోకి దిగాయి. ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని పోటీచేసి ఉంటే, ఫలితాలు మరో విధంగా ఉండేవి. గత ఎన్నికల్లో గెలిచిన సీట్లనే నిలబెట్టుకునేందుకు సీపీఎం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. సీపీఎం కూటమికి మైనార్టీ, గ్రామీణ బెంగాలీ ఓటర్లు దూరమయ్యారు. ఈ ఓటర్లు టీఎంసీ వైపు వెళ్లారు. జ్యోతి బసు, బుద్ధదేవ్ భట్టాచార్య లాంటి సీనియర్ సీపీఎం నేతలకు ఉన్నంత ఆకర్షణ ఇప్పుడు పార్టీ నేతలకు లేదు. రాష్ట్రంలోని 77వేల పోలింగ్ స్టేషన్లలో 30 శాతం చోట్ల సీపీఎంకు ఏజెంట్లు లేరు. మూడున్నర దశాబ్దాల పాటు రాజ్యమేలినా వామపక్ష పార్టీలకు మార్గనిర్దేశనం చేసే నేతే కరవయ్యారు. గట్టి కార్యకర్తలు లేరు. ఒకనాటి వైభవాన్ని వామపక్ష పార్టీలు కోల్పోయాయి. కానీ ఇప్పటికీ వామపక్ష పార్టీ సమావేశాలకు పెద్దఎత్తున జనం వస్తుంటారు. అవన్నీ ఓట్ల రూపంలో బదలాయింపు కావడం లేదని ఆ పార్టీ నేతలంటున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లను సమీకరించడంలో టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందున్నారు. 1980 లోక్‌సభ ఎన్నికల్లో వామపక్ష కూటమికి 38 సీట్లు వచ్చాయి. 50 శాతం ఓట్లను సాధించింది. ఆ తర్వాత ప్రతి లోక్‌సభ ఎన్నికలో 33 నుంచి 34 సీట్లను సీపీఎం కూటమి దక్కించుకునేది. 2008 నుంచి సీపీఎం గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. 2009లో సీపీఎం కూటమికి 15 సీట్లు వచ్చాయి. 2014లో రెండే రెండు సీట్లు దక్కించుకుని పరువు నిలుపుకుంది. ఈ ఎన్నికల్లో ఈ పార్టీకి 29 శాతం ఓట్లు వచ్చాయి. 2016 తర్వాత ఎన్నికల్లో వామపక్ష పార్టీల ఓట్ల శాతం వాటా 20 శాతం దిగువకు పడిపోయింది. 34 ఏళ్ల వామపక్ష పార్టీ పాలనతో విసుగుచెందిన ప్రజలు ఈ రోజు టీఎంసీ పాలనలో హాయిగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అన్ని సీట్లను స్వీప్ చేస్తుందని టీఎంసీ నేత పార్థ చటర్టీ ఆశాభావం వ్యక్తం చేశారు.