జాతీయ వార్తలు

కల్తీ మద్యం తాగి 12 మంది మృతి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపాల్ గంజ్, ఆగస్టు 17: మద్యనిషేధం అమలులో ఉన్న బిహార్ రాష్ట్రంలోని గోపాల్ గంజ్ జిల్లాలో కల్తీ మద్యం తాగి 12 మంది చనిపోయారు. అయితే అధికారులు మాత్రం వారు చనిపోవడానికి వెనుక కారణాలు స్పష్టంగా తెలియరాలేదని అంటూ దర్యాప్తుకు ఆదేశించారు. జిల్లాలోని అయిదు పోలీసు స్టేషన్ల పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో గత 24 గంటల్లో 12 మంది చనిపోయారని, ఒక వ్యక్తిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారని గోపాల్ గంజ్ జిల్లా కలెక్టర్ రాహుల్ కుమార్ బుధవారం పిటిఐకి చెప్పారు. కల్తీమద్యం తాగడం వల్లనే వీరు చనిపోయారా అని అడగ్గా, నిన్న సాయంత్రం వీరంతా కల్తీమద్యం తాగారని, ఆ తర్వాత చనిపోయారని కొంతమంది కుటుంబ సభ్యులు చెప్తున్నారని, అయితే మరికొందరు మాత్రం కల్తీ మద్యం కారణంగా వాళ్లు చనిపోలేదని లిఖితపూర్వకంగా తెలియజేశారని ఆయన చెప్పారు. మరణాలు అదే కారణం అయి ఉండకపోవచ్చని, ఎందుకంటే మరణాలు వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు సమయాల్లో చోటు చేసుకున్నాయని కలెక్టర్ చెప్పారు. మఝా, తావే, యాదవ్‌పూర్, సిధ్వాలియా, కొత్వాలి పోలీసు స్టేషన్ల పరిధిలో ఈ మరణాలు సంభవించాయి. కల్తీ మద్యం కారణంగానే మరణాలు సంభవించాయా లేక వేరే కారణమేదైనా ఉందా అనే విషయం తెలుసుకోవడం కోసం దర్యాప్తుకు ఆదేశించినట్లు కలెక్టర్ చెప్పారు. అన్ని కోణాల్లో దర్యాప్తు బృందం దర్యాప్తు జరుపుతుందని ఆయన తెలిపారు. చనిపోయిన 12 మందిలో అయిదుగురి మృతదేహాలను మాత్రం పోలీసులు పోస్టుమార్టం కోసం వారి బంధువులనుంచి సేకరించారని, మిగతా మృతదేహాలకు బంధువులు అంతకుముందే అంత్యక్రియలు జరిపించేశారని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతానికయితే మరణాలకు ఫలానా కారణమని కచ్చితంగా చెప్పలేమని, పోస్టుమార్టం నివేదిక, మృతుల బంధువుల స్టేట్‌మెంట్లు, దాడుల తర్వాత మాత్రమే కారణం చెప్పగలమని ఆయన తెలిపారు.