జాతీయ వార్తలు

ఏమిటీ..తిప్పేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 20: సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు కేంద్రంలో చంక్రం తిప్పడం కాదు, కనీసం బొంగరం కూడా తిప్పలేరని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీలో చేరిన సందర్భంగా ఆమెతో కలిసి లక్ష్మణ్ విలేఖరులతో మాట్లాడారు. డీకే చేరికతో బీజేపీకి బలం చేకూరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పార్టీ లోపాయికారి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. కేంద్రం మెడలు వంచుతామని ముఖ్యమంత్రి కేసిఆర్ చేసిన వ్యాఖ్యాలను ఆయన తప్పుబట్టారు. మజ్లీస్ పార్టీకి మించిన ముస్లింగా, ఆ పార్టీకి తొత్తుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని బీజేపీ నేత మండిపడ్డారు. హిందువుల నిజమైన ప్రతినిధి అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు రామమందిర నిర్మాణానికి అనుకూలమో వ్యతిరేకమో చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. బీజేపీపై తమ స్థాయికి మించి ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.