జాతీయ వార్తలు

ఉట్టి కొట్టాలంటే.. 18 ఏళ్లు నిండాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 17: మహారాష్టల్రో జన్మాష్టమి సందర్భంగా నిర్వహించే సంప్రదాయ దహీ హండీ (ఉట్లు కొట్టే కార్యక్ర మం)లో పాల్గొనే వారి వయ సు 18 ఏళ్ల కన్నా తక్కువ ఉండరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా ఉట్టి కొట్టడానికి ఏర్పడే మానవ పిరమిడ్‌ల ఎత్తు 20 మీటర్లకు మించరాదంటూ బొంబాయి హైకోర్టు విధించిన ఆంక్షను సడలించడానికి సైతం సుప్రీంకోర్టు నిరాకరించింది. ‘18 ఏళ్ల లోపు వయసు యువకులు పాల్గొనడాన్ని నిషేధిస్తూ, అలాగే మానవ పిరమిడ్ గరిష్ఠ ఎత్తు 20 మీటర్లకు పరిమితం చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను మేము కొనసాగిస్తున్నాం. ఇతర అంశాలను ఆ తర్వాత విచారిస్తాం’ అని న్యాయమూర్తులు ఎఆర్ దవే, ఎల్ నాగేశ్వర రావులతో కూడిన ధర్మాసనం బుధవారం స్పష్టం చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మహారాష్టల్రో దహీ హండీ వేడుకలను (ఉట్టి కొట్టే కార్యక్రమం) పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఒకరిపై ఒకరు ఎక్కి మానవ పిరమిడ్‌లా ఏర్పడి పైన వేలాడే పెరుగు కుండను కొట్టడమే ఈ ఆట ప్రత్యేకత. అయితే దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయంటూ స్వాతి పటేల్ అనే సామాజిక కార్యకర్త హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై స్పంచిన హైకోర్టు 18 ఏళ్లకన్నా తక్కువ వయసు వారు దహీ హండీ కార్యక్రమంలో పాల్గొనరాదని, అలాగే మానవ పిరమిడ్‌ల ఎత్తు 20 మీటర్లకు మించరాదని స్పష్టం చేస్తూ 2014లో తీర్పు ఇచ్చింది. అయితే దీనిపై వివరణ ఇవ్వాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అపీలు చేసింది. మొదట హైకోర్టు ఉత్తర్వు అమలును నిలిపి వేసిన సుప్రీంకోర్టుబుధవారం మహారాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ను కొట్టివేసింది. పిటిషన్ విచారణ సందర్భంగా మహారాష్ట్ర తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ, దహీ హండీలో పాల్గొనే ‘గోవిందా’లు శ్రీకృష్ణుడికి ప్రతీకలని, 12-15 ఏళ్ల మధ్య వయసు పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొంటే బాగుంటుందనేది ప్రజల నమ్మకం అని చెప్పారు. అయితే బెంచ్ ఆయన వాదనతో ఏకీభవించలేదు. ‘జనం గాయపడుతున్నారు. శ్రీకృష్ణుడు వెన్న దొంగిలించాడని విన్నాం కానీ, భగవంతుడు విన్యాసాలు చేశాడని వినలేదు’ న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.