జాతీయ వార్తలు

కాశ్మీరీల ఖాతాల ద్వారా ఉగ్రవాదులకు నిధులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 17: జమ్మూకాశ్మీర్‌లోని ఉగ్రవాదులకు విదేశాలలోని వారి సానుభూతిపరులు కాశ్మీర్‌కు చెందిన సామాన్య ప్రజల బ్యాంకు ఖాతాల ద్వారా అందజేస్తున్న విరాళాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) దర్యాప్తు ప్రారంభించింది. కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరించడానికి విదేశాలలోని వారి సానుభూతిపరులు భారత భద్రతా సంస్థలు, నిఘా సంస్థల కంటపడకుండా తప్పించుకునేందుకు హవాలా మార్గాల ద్వారా నిధుల బదిలీని ప్రారంభించారని అధికార వర్గాలు తెలిపాయి. కాశ్మీర్ నుంచి ఉపాధికోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారిని, అక్కడి ఉగ్రవాద సానుభూతిపరులు తొలుత మానసికంగా సిద్ధం చేస్తున్నారని, తరువాత వారి బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేస్తున్నారని, అనంతరం ఆ నిధులు కాశ్మీర్‌లోని ఉగ్రవాదులకు చేరుతున్నాయని అధికార వర్గాలు వివరించాయి. ఇందుకోసం బ్యాంకు ఖాతాలను ఉపయోగించుకున్నందుకు సదరు సామాన్యులకు ఒక శాతం చొప్పున కమిషన్ చెల్లిస్తున్నారని పేర్కొన్నాయి. బదిలీ అయిన 48 గంటలలోగా సదరు ఖాతాల నుంచి నగదు ఉపసంహరణ (తీసుకోవడం) జరుగుతోందని ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై దర్యాప్తు చేస్తున్న అధికారులు తెలిపారు. రిజర్వ్ బ్యాంకుకు అనుమానం రాకుండా ఉండటానికి చిన్న మొత్తాల్లో అంటే ఒకసారి రూ. ఒక లక్షకు మించకుండా నగదు బదిలీ చేస్తున్నారని వివరించారు.