జాతీయ వార్తలు

జైలు తప్పదేమో?! -- నవాజ్ షరీఫ్‌ను వెంటాడుతున్న భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఏప్రిల్ 11: తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్ని ప్రధాని పదవిని కోల్పోయిన నవాజ్ షరీఫ్‌కు జైలు భయం పట్టుకుంది. అడియాల జైలు తన కోసం సి ద్ధం చేస్తున్నారని బుధవారం ఇక్కడ ఆరోపించారు. రాజకీ య దురుద్దేశంతోనే జాయింట్ ఇన్విస్టిగేషన్ టీమ్ (జేఐటీ) ఏర్పాటైందని, తనను ఎలాగానే జైలుకు పంపాలన్న దురుద్దేశంతోనే దర్యాప్తు సాగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎవెన్‌ఫీల్డ్ ఆస్తుల కేసులో ఇస్లామాబాద్ కోర్టుకు హాజరైన 68 ఏళ్ల షరీఫ్ మీడియాతో మాట్లాడారు. ‘అడియాల జైలులో హౌస్ క్లీనింగ్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. దాన్ని ఎవరికోసం శుభ్రం చేస్తున్నదీ అందరికీ తెలుసు’ అని అన్నారు. రావల్పిండిలోని అడియాల జైలులో కరుడుగట్టిన నేరగాళ్లను ఉంచుతారు. ముంబయిపై ఉగ్రదాడికి సూత్రధాని, లష్కరె ఆపరేషన్స్ కమాండర్ జకీఉర్ రె హ్మాన్ లఖ్వీ లాంటి నేరగాళ్లను ఈ జైలులో ఉంచారు. లం డన్‌లో విలాసవంతమైన ప్రాంతంలో ఆస్తులకు సంబంధించిన షరీఫ్ కుటుంబ సభ్యులపై అనేక ఆరోపణలు వచ్చా యి. ఆదాయ వివరాలు వెల్లడించలేదన్న కారణంతో గత జులైలో పాకిస్తాన్ సుప్రీం కోర్టు నవాజ్ షరీఫ్‌పై అనర్హత వేటు వేసింది. దీంతో ఆయన ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. షరీఫ్, ఆయన అల్లుడు, కుమారులపై గత సెప్టెంబర్ 8న మూడు కేసులు నమోదయ్యా యి. అవినీతి కేసులు నేపథ్యంలో నవాజ్ రాజకీయ భ విష్యత్ ప్రశ్నార్థకంగా మా రింది. ఉద్దేశపూర్వకంగా, రా జకీయ కక్షతోనే కేసులు బ నాయించారని షరీఫ్ కుటుం బ సభ్యులు ఆరోపించారు. అలాగే బుధవారం మీడియా తో మాట్లాడిన షరీఫ్ కూడా జాయింట్ ఇన్విస్టిగేషన్ టీ మ్‌పై దుమ్మెత్తిపోశారు. జేఐటీలోని ముగ్గురు సభ్యులు రాజకీయ నేపథ్యం ఉన్నవారేనని ఆయన ఆరోపించారు. స భ్యులు, వారి భార్యలు, కుటుంబ సభ్యులు పాకిస్తాన్ తెహ్రీ క్ ఈ ఇన్సాఫ్ పార్టీలో చురుకైన కార్యకర్తలని మాజీ ప్రధాని విమర్శించారు. ‘నా కేసు ఉగ్రవాదానికి సంబంధించింది కా దు. పాకిస్తాన్ దేశ ప్రయోజనాలకు భంగకరమైం దీ కాదు. ఎందుకు జాయింట్ ఇన్విస్టిగేషన్ టీమ్‌లో ఐఎస్‌ఐ, మిలటరీ ఇంటిలిజెన్స్‌ను జొప్పించారు?’ అని ఆయన నిలదీశారు. జేఐటీ చీఫ్ వాజీద్ జియాపైనా షరీఫ్ తరఫున్యాయవాది ఖ్వాజా హెరీస్ ఆరోపణలు చేశారు. ఓ రాజకీయ అ జెండాతోనే తన క్లయింట్‌పై దర్యాప్తు సాగుతోందని ఆయన విమర్శించారు.