జాతీయ వార్తలు

..ఆలయాన్ని మూసేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, అక్టోబర్ 19: శబరిమల ఆలయ ప్రవేశం చేయాలనుకున్న ఇద్దరు మహిళలు అయ్యప్ప భక్తుల సెంటిమెంట్‌కు తలగ్గొక తప్పలేదు. కొండపైకి చేరుకున్నప్పటికీ వేలాది మంది భక్తులు వలయంలా ఏర్పడి వార్ని ముందుకు కదలనీయలేదు. శబరిమల కొండపై శనివారం ఈ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌కు చెందిన కవిత అనే జర్నలిస్టు, ఏర్నాకుళానికి చెందిన రేహ్మా ఫాతిమాలు పోలీసుల సహకారంతో కొండపైకి చేరుకున్నారు. అక్కడి నుంచి ఒక్క అడుగు ముందుకేయడానికి వీలులేకుండా పోయిం ది. అయ్యప్ప భక్తులు గోడలా నిలబడ్డారు. వెనక్కు వెళ్లిపోవల్సిందిగా దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. అలాగే ఆలయంలోకి వస్తే తలుపులు మూసేస్తామని ప్రధాన పూజారి తీవ్రంగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పరిస్థితి తీవ్ర రూపం దాలుస్తుందని గమనించిన ఐజీ ఎస్ శ్రీజిత్ ఇద్దరు మహిళలను తమ కార్యాలయానికి తీసుకెళ్లి నచ్చజెప్పారు. వెనక్కు వెళ్లిపోవల్సిందిగా చెప్పి పోలీసుల భద్రతతో తీసుకెళ్లారు. కొండపైకి చేరుకున్న ఇద్దరు మహిళలూ పోలీసు యూనిఫామ్, హెల్మెట్లు ధరించి ఉండడంతో అయ్యప్ప భక్తులకు ఆగ్రహం తెప్పించింది. అన్ని వయస్సుల మహిళలకు ఆలయ ప్రవేశం కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. నెలవారీ పూజల నిమిత్తం బుధవారం ఆలయాన్ని తెరిచారు. తొలి రోజులు ఏపీకి చెందిన ఓ మహిళ కుటుంబ సమేతంగా వచ్చి స్వామి దర్శనానికి విఫలయత్నం చేసింది. రోజురోజుకూ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీ ఎత్తున బలగాలను మోహరించారు. 10-50 ఏళ్ల మధ్యవయస్కులైన మహిళలు రావద్దని ఆలయ ప్రధాన పూజారి రెండ్రోజుల క్రితమే విజ్ఞప్తి చేశారు. న్యూయార్క్ టైమ్స్‌కు ఇండియన్ కరస్పాండెంట్ సుహాసిని రాజ్ పలువురు విదేశీయులను వెంటబెట్టుకుని పంబా గేట్‌వేను దాటి వెళ్లారు. అయితే వేలాది మంది అయ్యప్ప భక్తులు 4.7 కిలోమీటర్ల పంబ మార్గంలో భారీగా మోహరించారు. దీంతో మార్గమధ్యలోంచే కరస్పాండెంట్ వెనుదిరగాల్సి వచ్చింది. గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.