జాతీయ వార్తలు

అంత్యక్రియలు జరపొద్దు : హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలహాబాద్, ఏప్రిల్ 11: యూపీలో ఉన్నావ్ గ్యాంగ్‌రేప్ బాధితురాలి తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించవద్దని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. 18 ఏళ్ల బాధితురాలి తండ్రి మంగళవారం నాడు పోలీసు కస్టడీలో మృతి చెందిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్‌సింగ్ సెంగార్, అత డి సోదరుడు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ‘బాధితురాలి తండ్రి మృతదేహానికి అంత్యక్రియలు పూ ర్తిచేయకపోతే అలా ఉంచండి. అంత్యక్రియలు చేయవద్దు’ అం టూ అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీబీ భోసాలే నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. కేసు పూర్తి వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 12కు వాయిదా వేశాలు. కాగా సంచలనం రేపిన సామూహిక అత్యాచారం కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్‌సింగ్ సోదరుడు అతుల్ సింగ్‌ను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు.