జాతీయ వార్తలు

అవును.. నష్టమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఏప్రిల్ 11: రాష్ట్రాలకు నిధుల పంపిణీలో 15వ ఆర్థిక సంఘం పరిశీలనాంశాలను మళ్లీ రూ పొందించాలంటున్న దక్షిణాది రాష్ట్రాలతో తాజాగా తమిళనాడు సైతం గొంతు కలిపింది. 2011 జనాభా ప్రాతిపదికన నిధుల పంపిణీ జరిపితే రాష్ట్రాలకు తీరని నష్టం వాటిల్లుతుందన్న ఏపీ, కర్నాటక, కేరళ, పాండిచ్చేరిల వాదనను పరోక్షంగా తమిళనాడు సమర్థించింది. జనాభా నియంత్రణకు గత 40ఏళ్లుగా స మర్థవంతమైన చర్యలు తీసుకుంటున్న తమిళనాడుకు తాజా విధానం శరాఘాతమేనని వ్యాఖ్యానించింది. రాజ్యాంగంలో ప్రవచించిన సమాఖ్య స్ఫూ ర్తికి విఘాతం కలిగిస్తోన్న ఈ అంశంపై పునరాలోచన చేయాలని కేంద్రాన్ని లేఖల ద్వారా కోరనుంది. సీఎం పళనిస్వామి నేతృత్వంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని బుధవారం అధికారికంగా ప్రకటించారు. అలాగే, ఆర్థిక సంఘం అధికారులను స్వయంగా ఎంపీలు కలిసి తాజా నిర్ణయం ప్రగతిశీల రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతకరమన్న విషయాన్ని వివరించాలని నిర్ణయించింది. 1971 జనాభా లెక్కల ప్రాతిపదికన కాకుండా, 2011 సెనె్సస్ ప్రాతిపదికన కేంద్ర పన్నుల ఆదాయాన్ని పంపిణీ చేస్తే తమిళనాడు లాంటి రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందంటూ ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, నీతి ఆయోగ్ అధికారులకు సీఎం పళనిస్వామి లేఖలు రాయనున్నారు. అవకాశం వచ్చినపుడు ఈ విషయాన్ని అధికార ఏఐడీఎంకె ఎంపీలు పార్లమెంట్‌లో లేవనెత్తాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. అయితే, మంగళవారం దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేరళలో జరిగిన సమావేశానికి ఎందుకు హాజరుకాలేదన్న విషయాన్ని ఆ ప్రకటనలో తమిళనాడు సర్కారు స్పష్టం చేయకపోవడం గమనార్హం.