జాతీయ వార్తలు

గ్యాంగ్‌రేప్ కేసుపై వచ్చే వారం విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నవో గ్యాంగ్‌రేప్ కేసు సీబీఐకి అప్పగించాలని దాఖలైన పిటిషన్‌ను వచ్చేవారం సుప్రీం కోర్టు విచారించనుంది. బీజేపీ ఎమ్మెల్యే ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు. బాధితురాలి తండ్రి పోలీసు కస్టడీలోనే మరణించిన సం ఘటన సంచలనం సృష్టించింది. రాష్ట్రంలోని అధికార బీజేపీ పాత్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో కేసుకు ప్రాధాన్యత ఏర్పడింది. గత ఏడాది జూలై నెలలో బాలిక కిడ్నాప్, సామూహిక అత్యాచారం ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ మనోహర్‌లాల్ శర్మ అనే న్యాయవాది సుప్రీంలో పిటిషన్ దాఖ లు చేశారు. బాధితురాలి తండ్రిని చిత్రహింసలకు గురిచేసి పోలీసు కస్టడీలోనే చంపేశారని ఆయన ఆరోపించారు. ఏప్రిల్ 9న జరిగిన ఘటనకు సంబంధించి అధికార బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్‌సింగ్ సెంగార్, అతడి అనుచరుల పాత్ర ఉందన్నారు. బుధవారం పిటిషన్‌ను స్వీకరించిన ప్రధా న న్యాయమూర్తి దీపక్ మిశ్రా సారధ్యంలోని జస్టిస్ ఏఎం ఖన్వీకర్, జస్టిస్ డివై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం వచ్చేవారం పిటిషన్‌ను విచారిస్తామని ప్రకటించింది.