జాతీయ వార్తలు

చిదంబరాన్ని కస్టడీకి ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: ఎయిర్‌సెల్- మాక్సిస్ మనీల్యాండరింగ్ కేసులో నిందితుడైన మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం ఆంటిసిపేటరీ బెయిల్ కోసం పెట్టుకున్న విజ్ఞప్తిని తిరస్కరించాలని ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ఢిల్లీ కోర్టును కోరింది. అంతేగాక విచారణ నిమిత్తం చిదంబరాన్ని తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. ఈ కేసులో నిజానిజాలు నిగ్గుదేల్చేందుకు చిదంబరం తమతో సహకరించడం లేదని, ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా ఈడీ అధికారులు కోర్టుకు వివరించారు. చిదంబరం బెయిల్ కోసం చేసుకున్న అభ్యర్థనపై గురువారం కోర్టులో ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ విచారణ చేపట్టనున్నక్రమంలో ఈడీ ప్రతిఘటన చర్యలు చేపట్టింది. చిదంబరం, ఆయన కుమారుడు కార్తీలను నిందితులుగా పేర్కొంటూ ఎయిర్‌సెల్-మాక్సిస్ వ్యవహారంలో సీబీఐ, ఈడీ కేసులు నమోదుచేయడంతో వారిని అరెస్టు చేయకుండా అక్టోబర్ 8న న్యాయస్ధానం మధ్యంతర రక్షణ ఉత్తర్వులను జారీచేసింది. కాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అక్టోబర్ 25న చిదంబరంపై చార్జిషీట్ ఫైల్ చేసింది. ఎయిర్‌సెల్-మాక్సిస్ మనీల్యాండరింగ్ కేసులో చిదంబరం కుట్రపూరితంగా వ్యవహరించి విదేశీ పెట్టుబడిదారులకు వెంచర్ క్లియర్ చేయించారని ఈడీ అభియోగం మోపింది.