జాతీయ వార్తలు

మోదీ ‘అవినీతి నావ’ మునుగుతుంది: కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: మోదీ ప్రభుత్వ ‘అవినీతి నావ’ ఇక ఎంతోకాలం పయనించలేదని అది మనగడం ఖాయమని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. రఫెల్ కేసుకు సంబంధించి 36 ఎయిర్‌జెట్లను ఎంతకు కొన్నది ధర, ఇతర వివరాలను తెలియజేయాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ రఫెల్ కొనుగోలు వ్యవహారంలో వాస్తవ వివరాలను కోర్టు అడిగినందున ఇక మోదీ అవినీతి నావ ఇక ఎంతోకాలం ప్రయాణించ లేదని పేర్కొన్నారు. వేల కోట్ల అవినీతికి పాల్పడ్డ కేంద్రం దానిపై విచారణ జరగకుండా ఇక ఎంతోకాలం తప్పించుకోలేదని, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయించకుండా ఆపలేదని ఆయన అన్నారు. ‘ప్రియమైన ప్రధాని గారు జేపీసీ దర్యాప్తు చేయించకుండా ఎందుకు సిగ్గుతో పారిపోయారో ప్రజాన్యాయస్థానానికి మీరు వివరించాలి’ అని ఆయన పేర్కొన్నారు. రాఫెల్ కుంభకోణం ఇప్పుడు మంచి పక్వ దశలో ఉందని, ఇక దానికి ఎలాంటి క్షమాపణలు, మినహాయింపులు ఉండవని ఆయన చెప్పారు. కాగా రాఫెల్ ఒప్పందానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి బీజేపీ ప్రభుత్వంపై పెద్దయెత్తున ఆరోపణలు చేస్తోంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఒక్కో జెట్ విమానాన్ని 526 కోట్లతో కొనుగోలు చేయాలని నిర్ణయించగా దానిని ఎన్డీఏ ప్రభుత్వం 1670 కోట్లకు పెంచింది. అలాగే విమానాలు పంపే ఫ్రాన్స్‌కు చెందిన డస్సాల్ట్ కంపెనీ తన భారత వాణిజ్య భాగస్వామిగా విమానాల తయారీలో ఎలాంటి అనుభవం లేని రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంచుకోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇందులో వేల కోట్ల కుంభకోణం దాగి ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.