జాతీయ వార్తలు

ధర్మశాలలో దీపావళి ఆఫర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల, అక్టోబర్ 31: దేశంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ధర్మశాలలోని హోటళ్లు దీపావళి సందర్భంగా భారీ డిస్కౌంట్లతో ముందుకొస్తున్నాయి. పర్యాటకులను ఆకట్టుకునేందుకు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు. పర్వత ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్‌లో ధర్మాశాల టూరిస్ట్ హబ్‌గా విరాజిల్లుతోంది. అయితే ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు హోటల్ వ్యాపారంపై ప్రతికూల ప్రభావం చూపింది. అక్రమంగా నిర్మించిన 80 హోటళ్లను మూసివేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో పట్టణానికి పర్యాటకుల రాక తగ్గిపోవడంతోపాటు ఆదాయం ఘోరంగా పడిపోయింది. 70 శాతం వరకూ ఆదాయం తగ్గిపోయిందని హోటల్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర్మశాల పట్టణ పరిధిలోని 80 హోటళ్లు/గెస్ట్‌హౌస్‌లు మూసేయాలని, వాటికి నీరు, విద్యుత్ సరఫరా ఆపేయాలని కోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం వంద హోటళ్లే పనిచేస్తున్నాయి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆన్‌లైన్ బుక్కింగ్ బాగా తగ్గిపోయి నష్టాలను చవిచూస్తున్నామని హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశ్వినీ బాంబా వాపోయారు. గత ఏడాదితో పోల్చుకుంటే దసరాలకు కేవలం 25-30 శాతం వ్యాపారమే సాగిందని ఆయన అన్నారు. దీంతో నష్టాల నుంచి బయపడేందుకు 30 శాతం ఫ్లాట్ డిస్కౌంట్ ఇవ్వాలని యజమానులు నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు. నవంబర్ 1 నుంచి ఈ బుకింగ్‌లు అందుబాటులోకి వస్తాయన్నారు. రెండు రాత్రులు ఉండడానికి బుక్ చేసుకుంటే ఓ రాత్రి అదనంగా ఉండొచ్చని తెలిపారు. డిస్కౌంట్ ఆఫర్ల వల్ల దీపావళికి 50 నుంచి 60 శాతం వరకూ వ్యాపారం పెరుగుతుందన్న ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు. ఈ ఏడాది పర్యాటకుల కోసం ప్రతి హోటల్‌లోనూ కంగ్రీ ధమ్(స్థానిక ఫుడ్‌ఫీస్ట్) ఉంటుంది.