జాతీయ వార్తలు

పటేల్ విగ్రహం వద్దనే డీజీపీల వార్షిక సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: ఈ ఏడాది దేశంలోని వివిధ రాష్ట్రాల పోలీసు డీజీపీలు, ఇతర పోలీసు ఉన్నతాధికారుల సమావేశాలు ప్రపంచంలోనే ఎత్తయన 182 మీటర్ల పటేల్ విగ్రహం వద్ద ఉన్న భవనంలో జరుగుతాయి. ఈ వివరాలను కేంద్రం వెల్లడించింది. ప్రపంచంలోనే ఎత్తయన పటేల్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ బుధవారం ఆవిష్కరించిన విషయం విదితమే. ప్రతి ఏడాది పోలీసు ఉన్నతాధికారుల వార్షిక సమావేశాన్ని కేంద్ర హోంశాఖ నిర్వహిస్తుంది.
ఈ ఏడాది డిసెంబర్‌లో ఈ సమావేశాన్ని పటేల్ విగ్రహం వద్ద నిర్వహిస్తామని కేంద్రం పేర్కొంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సు వివరాలు ఖరారు కావాల్సి ఉంటుంది. డిసెంబర్ మూడవ వారంలో ఈ సమావేశాలు ఉండవచ్చు. అప్పటికి రాజస్తాన్, చత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఫలితాలు ప్రకటన ముగుస్తుంది. ఇండియన్ పోలీసు సర్వీసు (ఐపీఎస్)కు సర్దార్ పటేల్‌కు మధ్య అవినాభావ సంబంధం ఉంది. హైదరాబాద్‌లోని జాతీయ పోలీసు అకాడమికి పటేల్ పేరునే నామకరణం చేశారు. ఐపీఎస్ కేడర్ కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుంది. అంతర్గత భద్రత, నేరాలు, ఇతర సవాళ్లపై వార్షిక సదస్సులో కేంద్ర హోంశాఖ సమీక్షిస్తుంది. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఏటా ఈ సదస్సును ఢిల్లీ వెలుపల నిర్వహిస్తోంది. గువహటి, రాణా ఆఫ్ కుచ్, హైదరాబాద్, తెకనాపూర్ (మధ్యప్రదేశ్)లో పోలీసు డీజీపీల సదస్సునునిర్వహించారు.