జాతీయ వార్తలు

బీసీలకు 30 సీట్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: కాంగ్రెస్ అధినాయకత్వం తెలంగాణ శాసన సభకు పోటీచేసే పార్టీ అభ్యర్థుల జాబితాను ఒకటి, రెండు రోజులు లేదా దీపావళి మరుసటి రోజు ప్రకటించే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థుల మొదటి జాబితాతోపాటు మిత్రపక్షాల జాబితాను కూడా ప్రకటించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియాతో సమావేశమై పార్టీ అభ్యర్థుల ఎంపిక, మిత్రపక్షాలకు కేటాయించవలసిన సీట్లు, వెనుకబడిన కులాలకు ఇవ్వలసిన సీట్ల అంశంపై లోతుగా చర్చించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి దాదాపు 51 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక అభ్యర్థిని సిఫారసు చేసిన జాబితాను రాహుల్ గాంధీకి అందజేసినట్లు తెలిసింది. దీనితోపాటు మహాకూటమి మిత్రపక్షాలైన తెలుగుదేశం, తెలంగాణ జన సమితి, సీపీఐ పార్టీలకు కేటాయించవలసిన సీట్లు, నియోజకవర్గాల జాబితాను కూడా రాహుల్ గాంధీకి అందజేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకే పేరును ప్రతిపాదించిన 51 నియోజకవర్గాల పేర్లను మొదటి జాబితాగా ప్రకటించే అవకాశాలు లేకపోలేదని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. భక్తచరణ్‌దాస్ నాయకత్వంలోని రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ తయారు చేసిన పార్టీ అభ్యర్థుల జాబితాను కూడా రాహుల్ గాంధీకి అందజేశారు. ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ గురువారం మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో సమావేశమై తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాకు తుదిరూపం ఇస్తుంది. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే తెలంగాణ శాసనసభకు కాంగ్రెస్ తరపున పోటీచేసే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తారని చెబుతున్నారు. రాష్ట్రంలోని ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో కనీసం రెండు అసెంబ్లీ సీట్లను వెనుకబడిన కులాలవారికి కేటాయించాలని రాహుల్ గాంధీ ఆదేశించినట్లు తెలిసింది. ఈ లెక్కన కనీసం 30 సీట్లను బీసీలకు కేటాయించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ శాసనసభ్యులందరికీ టికెట్లు కేటాయించనున్నట్లు తెలిసింది. గత ఎన్నికల్లో రెండోస్థానం సంపాదించిన కాంగ్రెస్ అభ్యర్థులందరికీ టికెట్లు
ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మిగతా నియోజకవర్గాల్లో విజయావకాశాలు అధికంగా ఉన్నవారిని రంగంలోకి దించాలని రాహుల్ సూచించినట్లు చెబుతున్నారు.
రాష్ట్రంలో మహాకూటమి ఏర్పడే పక్షంలో తెలుగుదేశం పార్టీకి పది నుండి పదిహేను సీట్లు, కోదండరాం నాయకత్వంలోని పార్టీకి ఐదు నుండి ఏడు సీట్లు, వామపక్షాలు, ఇతరులకు నాలుగు సీట్లు కేటాయించే అవకాశాలున్నాయని అంటున్నారు. తెలంగాణ శాసనసభలోని మొత్తం 119 సీట్లనుండి మిత్రపక్షాలకు ఇరవై ఐదు నుండి ముప్పై సీట్లు కేటాయించే పక్షంలో మిగతా 89సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తారు. కాంగ్రెస్ పోటీచేసే 89 సీట్లనుండి ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు చేసిన 31 సీట్లు తీసివేస్తే 58 మిగులుతాయి. ఈ సీట్లలోనుండి కనీసం 30 సీట్లను వెనుకబడిన కులాల వారికి కేటాయించాలని రాహుల్ గాంధీ స్పష్టం చేశారని అంటున్నారు. బీసీలకు 30 సీట్లు కేటాయించిన అనంతరం మిగిలే సీట్లకు ఉన్నత వర్గాలకు చెందిన గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తారని అంటున్నారు.
ఇదిలా ఉంటే వెనుకబడిన కులాల వారికి కేటాయించాలనుకుంటున్న 30 సీట్ల విషయం కొంత వివాదాస్పదమైంది. గత ఎన్నికనల్లో బీసీలకు కేటాయించిన దాదాపు అన్ని సీట్లను ఓడిపోయాం.. ఈసారి కూడా ఇదే పరిస్థితి ఎదురైతే పార్టీ పరిస్థితి ఏమిటని కొందరు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీసీలకు ముప్పైకి బదులు ఇరవై సీట్లు కేటాయిస్తే బాగుంటుందనే సూచన కూడా వచ్చినట్లు చెబుతున్నారు.