జాతీయ వార్తలు

తిత్లీ బాధిత ప్రాంతాలకు కేంద్ర సాయం రూ.229కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని తిత్లి తుపాను బాధిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.229.05 కోట్లు విడుదల చేసింది. ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధి నుండి కేంద్రం వాటాగా 2018-10 సంవత్సరానికి అడ్వాన్సుగా ఈ మొత్తం విడుదల చేస్తున్నట్లు కేంద్ర హోం శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. తిత్లి తుపాను అక్టోబర్ 11న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో బీభత్సం సృష్టించటం తెలిసిందే. తిత్లీ తుపాను మూలంగా సంభవించిన నష్టంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేసిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఏర్పాటు చేసిన అంతర్ మంత్రిత్వ శాఖల కమిటీ అక్టోబర్ 24 నుండి రెండు రోజుల పాటు ప్రభావిత జిల్లాల్లో పర్యటించిందని హోం శాఖ ఆ ప్రకటనలో తెలిపింది. సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టేందుకు కేంద్రం రాష్ట్రానికి అన్ని విధాల తోడ్పడిందని తెలిపింది.