జాతీయ వార్తలు

పక్కదోవ పడుతున్న హత్యాయత్నం కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని జాతీయ నాయకులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వివరించారు. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి, బాలశౌరి, రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి బుధవారం సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, లోక్‌తాంతంత్రిక్ జనతాదళ్ పార్టీ అధ్యక్షుడు శరద్ యదవ్‌లను కలిశారు. విశాఖలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం ఘటన వివరాలను వారికి వివరించారు. ఈ ఘటన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును, కేసును పక్కదారి పట్టిస్తున్న నేపథ్యాన్ని తెలియజేశారు. అనంతరం విజయ సాయిరెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ జగన్ హత్యాయత్నం కేసు విషయంలో జాతీయ నాయకులను మభ్యపెట్టేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ యాత్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై కేంద్ర న్యాయ శాఖ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. వరప్రసాద్ మాట్లాడుతూ ఈ కేసులో నిష్పాక్షిక విచారణను కోరేందుకే తమ పార్టీ నేతలు ఢిల్లీకి వచ్చినట్టు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే ఢిల్లీకి రావడంలోని మర్మమేమిటని ప్రశ్నించారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ హత్యాయత్నం కేసుపై నిష్పాక్షికంగా విచారణ జరగాలని వైఎస్సార్ కాంగ్రెస్ డిమాండ్ చేయడం సమంజసమేనని సీతారాం ఏచూరి తమతో ఏకీభవించారని చెప్పారు. మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పక్కాక్క అవకాశవాదని, తన ప్రయోజనాల కోసం ఏ రాజకీయ పార్టీతోనైనా కలుస్తారని ఎద్దేవా చేశారు.