జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో ఎదురు కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, నవంబర్ 1: జమ్మూకాశ్మీర్‌లో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు లష్కర్-ఇ-తోయిబా ఉగ్రవాదులు మృతి చెందగా, ఒక జవాన్ గాయపడ్డాడు. గురువారం జమ్మూకాశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో ఉగ్రవాదులు దాగి ఉన్నారని అందిన విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా దళాలు ఖాన్‌సాహిబ్‌లోని జాగూ ప్రాంతంలో వెతుకుతున్నారు. హఠాత్తుగా వారిపైకి ఉగ్రవాద మూకలు కాల్పులకు తెగబడ్డాయి. దీంతో అప్రమత్తమైన భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. వారిని లష్కర్-ఇ-తోయిబాకు చెందిన ముక్తార్ అహ్మద్‌ఖాన్, మహ్మద్ అమీన్ మీర్ గా గుర్తించారు. వీరు గతంలో పలుసార్లు ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనడమే కాకుండా భద్రతా దళాలపై దాడులకు సైతం తెగబడ్డారని ఒక అధికారి తెలిపారు. దాడిలో గాయపడ్డ జవాన్‌ను ఆసుపత్రికి తరలించామని, ఆయన పరిస్థితి నిలకడగా ఉందని ఆయన చెప్పారు. సంఘటనా స్థలం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇలావుండగా ఈ సంఘటనను కవరేజి చేయడానికి వస్తున్న ఒక మీడియాకు చెందిన ఔట్‌డోర్ బ్రాడ్‌క్యాస్టింగ్ (ఓబి) వ్యాన్‌పై కొందరు దుండగులు బద్గాం జిల్లాలో రాళ్లదాడి చేయడంతో వ్యాన్ అద్దాలు పగిలాయి. ఈ సంఘటనలో ఎవరూ గాయపడినట్టు తమకు సమాచారం అందలేదని అధికార వర్గాలు వెల్లడించాయి.