జాతీయ వార్తలు

టీచర్లకే.. టీచర్ కడియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ శిక్షణపై అధ్యయనానికి కేంద్ర మానవ వనరుల శాఖ ఏర్పాటు చేసిన కమిటీకి చైర్మన్‌గా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నియమితులయ్యారు. కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జావడేకర్ నేతృత్వంలో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) 55వ కౌన్సిల్ సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన కడియం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ గతంలో తాను చైర్మన్‌గా ఉన్నపుడు బాలికల విద్యపై ఇచ్చిన నివేదికలోని అంశమైన కస్తుర్బా గాంధీ బాలికల పాఠశాలలను 12 తరగతి వరకు దశలవారీగా పెంచేందుకు కేంద్రం నిర్ణయించిందని గుర్తు చేశారు. గతంలో ఈ పాఠశాలలో కేవలం 8 వరకు మాత్రమే బాలికలకు విద్యను అందించేవారని చెప్పారు. తామిచ్చిన సూచనలలో ఒక సూచనకు మాత్రమే కేంద్రం అంగీకరించిందని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ప్రీ ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించాలని కేంద్రాన్ని కోరామని, ఇప్పటికే తెలంగాణలో 12వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రైమరీ స్కూళ్లను నిర్వహిస్తున్నట్టు కడియం వివరించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని, విద్యార్థులకు ఇస్తున్న బట్టలను 12వ తరగతి వరకు అందించేలా రాష్ట్రాలకు సహకరించాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. సర్వశిక్షా అభియాన్, రాజీవ్ విద్యా మిషన్, ఉపాధ్యాయ శిక్షణ అన్నీ కలిపి తెలంగాణలో సమగ్ర శిక్షా అభియాన్ పథకం ఏర్పాటు చేస్తున్నామని కేంద్రానికి వివరించినట్టు తెలిపారు. వచ్చే బడ్జెట్‌లో 20 శాతం నిధులు విద్యా రంగానికి పెంచుతామని ప్రకాశ్ జావడేకర్ తెలియజేసినట్టు వెల్లడించారు. తెలంగాణలో ఏర్పాటుచేసిన కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరినట్టు శ్రీహరి తెలిపారు. విలేఖరుల సమావేశంలో కడియంతోపాటు ఎంపీ సీతారాం నాయక్ ఉన్నారు.