జాతీయ వార్తలు

బ్రూ శరణార్థుల శిబిరాలకు ప్రచారాల కోసం రావొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐజావీ, నవంబర్ 1: త్రిపురలోని బ్రూ కులానికి చెందిన శరణార్థుల శిబిరాలకు ఎన్నికల ప్రచారం కోసం మిజోరాంలోని ఏ రాజకీయ పార్టీలూ వెళ్లరాదని మిజోరాం బ్రూ నిర్వాసిత ప్రజల ఫోరం (ఎంబీడీపీఎఫ్) విజ్ఞప్తి చేసింది. ఇక్కడి 40 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 28న ఎన్నికలు జరుగనున్న క్రమంలో ఎంబీడీపీఎస్ విజ్ఞప్తి ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫోరం ఉపాధ్యక్షుడు ఆర్. లాల్‌డాంగ్లియానా మాట్లాడుతూ తమ కమ్యూనిటీ సభ్యులెవరూ మిజోరాంలోని రాజకీయ పార్టీలు నిర్వహించే సమావేశాల్లో పాల్గొనేందుకు ఆసక్తిగాలేరని తెలిపారు. తమ శిబిరాల్లోకి రాజకీయ పార్టీలను అనుమతించేదిలేదని స్పష్టం చేశారు. ప్రధాన కార్యదర్శి బ్రూనోమ్షా మాట్లాడుతూ రాజకీయ పార్టీల అసంఘటిత ప్రచార సభలతో ఈ శిబిరాల్లో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం అయ్యే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. ఈ ప్రాంతంలో ప్రచారం, ర్యాలీలు నిర్వహించదలుచునే రాజకీయ పార్టీలు ఎంబీడీపీఎఫ్ నాయకత్వాన్ని సంప్రదించాలన్నారు, తామంతా ఐక్యంగానే ఉంటామని, రాజకీయాలతో విడిపోవాలని కోరుకోవడం లేదని తెలిపారు. ఇప్పటి వరకు ఇక్కడ ఏ రాజకీయ పార్టీ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టలేదని, ఐతే వివిధ రాజకీయ పార్టీల జెండాలు మాత్రం ఇక్కడి శరణార్థుల ఇళ్లపై దర్శనం ఇస్తున్నాయని తెలిపారు. 1997లో జరిగిన అల్లర్లలో మిజోరాంలోని వేలాది మంది బ్రూ కులస్థులు అక్కడినుంచి త్రిపురకు శరణార్థులుగా తరలివచ్చి ఆశ్రయం పొందారు. బ్రూ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (బీఎన్‌ఎస్‌ఎఫ్)కు చెందిన మిలిటెంట్లు ఓ అటవీ శాఖ అధికారిని హతమార్చడంతోనే పెద్దయెత్తున అల్లర్లు చోటుచేసుకుని హింసకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మిజోరాం, త్రిపుర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో శరణార్థులను తిరిగి వారి స్వస్థలాలకు విడతల వారీగా చేర్చేందుకు చర్యలు చేపట్టడం జరిగింది. అప్పటి నుంచి బ్రూ కులస్థుల కుటుంబాలు మిజోరాంకు తిరిగి వెళ్లినప్పటికీ అక్కడ రక్షణ సమస్యలతోబాటు, సరైన ప్యాకేజీ లేని కారణంగా అనేక శరణార్థుల కుటుంబాలకు త్రిపుర నుంచి తరలివెళ్లేందుకు అనుమతి లభించలేదు. ఈ శరణార్థుల శిబిరాల వద్ద ఎన్నికల కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఎంబీడీపీఎఫ్ విజ్ఞప్తి చేసింది.