జాతీయ వార్తలు

ఆక్రమణలు మా లక్ష్యం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఇతర దేశాల భూభాగాలు ఆక్రమించాలన్నది భారత్ లక్ష్యం కాదని, దేశంలో ఆర్థికపరమైన ప్రగతి సాధనకు, సామాజిక, రాజకీయపరమైన అభివృద్ధికి అంతర్గత, బాహ్య రక్షణకు తాము కట్టుబడి ఉన్నామని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ చెప్పారు. ముఖ్యంగా తూర్పు ఆసియా, సౌత్ చైనా సముద్రంలోని అంతర్జాతీయ జల సరిహద్దు ప్రాంతాలు తమకు గట్టిసవాల్‌గా మారాయని అన్నారు. ఇక్కడ గురువారం జరిగిన ఒక సెమినార్‌లో ఆయన ప్రసంగిస్తూ తమ రక్షణ పాలసీ ప్రాథమికంగా రెండు అంశాలతో ముడిపడి ఉందని అన్నారు. ఇతరుల భూ భాగాలు ఆక్రమించకపోవడం, తమ ఆలోచనలను ఇతరులపై రుద్దకపోవడమని, అంతర్గత, బాహ్య భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ దేశం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమని ఆయన అన్నారు. అందుకే ఇండో పసిఫిక్ ప్రాంతంలో తాము సుస్థిరతను కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. ఇండోపసిఫిక్ పరిధిలోని ఇండియన్ ఓషన్ రీజియన్‌లో భారత్ పరిధిలోని ప్రాంతంలో తమ దేశ అవసరాలకు కట్టుబడి పనిచేస్తామన్నారు. మానవకోటి రక్షణ, వైపరీత్యాల రక్షణ కార్యక్రమాలు, సెర్చ్, రిస్క్యూ తదితర అంశాలకు భారత్ ఆర్మీ ప్రాధాన్యతను ఇస్తుందని చెప్పారు. కార్యక్రమానికి విచ్చేసిన భారత్‌లోని ఆస్ట్రేలియా హై కమిషనర్ హరీందర్ సింధు మాట్లాడుతూ తమను ఆహ్వానిస్తే మలబార్‌లో నిర్వహించే కార్యక్రమాల్లో తాము సైతం భాగస్వాములవుతామని చెప్పారు. అమెరికా, జపాన్, భారత్ దేశాలు మూడుపక్కలు గల మలబార్‌లో నేవీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆస్ట్రేలియా ఆసక్తిగా ఉందన్నారు. భారత్ ఎప్పుడూ తమకు ముఖ్యమైన భాగస్వామి అని, వ్యూహాత్మకమైన ఈ భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని తాము కోరుకుంటున్నామన్నారు. దీనికోసం తమ సంబంధాలను మరోమెట్టుకు తీసుకెళ్లాల్సి ఉందని ఆమె అన్నారు.