జాతీయ వార్తలు

దళితులు, మైనారిటీలపై దాడులు దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, ఏప్రిల్ 11: దేశ వ్యాప్తంగా దళితులు, మైనారిటీలపై దాడులు పెరిగిపోయాయని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికే చేటని హెచ్చరించారు. పంజాబ్ వర్శిటీలో ఎస్‌బి రంగ్నేగర్ స్మారకోపన్యాసంలో మన్మోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దళితులు, మైనారిటీలపై దాడులు స్వేచ్ఛ, అభివృద్ధికి విఘాతమేనన్నారు. ‘మతం, కులం, ప్రాంతీయ, భాష ప్రాతిపదికన విద్వేషాలు పెరిగిపోయాయి. మైనారిటీలు, దళితులపై దాడులకు అంతూపంతూ లేదు. ఇలాంటివి వాంఛనీయం కాదు. సరికదా ప్రజాస్వామ్యానికే చేటు’ అన్నారు. స్వేచ్ఛ అన్నది దేశానికే తప్ప ప్రభుత్వానికి సంబంధించింది ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు. ‘దేశంలో ప్రతి భారతీయుడికీ తగినంత స్వేచ్ఛ ఉంది. దాన్ని కాలరాయకూడదు. దురదృష్టవశాత్తూ అదే జరుగుతోంది’ అన్నారు. బీఆర్ అంబేద్కర్ ప్రవచించిన స్వేచ్చ, సమానత్వం, ప్రజాస్వామ్య పరిరక్షణకు అంకితభావంతో పనిచేయాలని ఉద్ఘాటించారు. ప్రజాస్వామ్యానికి చేటుచేసే చర్యలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ‘స్వేచ్ఛ కోసమే స్వాతంత్య్ర పోరాటం జరిపాం. మహాత్మాగాంధీ బాటలో అందరూ నడవాలి. స్వేచ్ఛ మన జన్మహక్కు’ అని ఉద్ఘాటించారు.