జాతీయ వార్తలు

సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నలుగురు ప్రమాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా హేమంత్ గుప్తా, ఆర్.సుభాష్‌రెడ్డి, ఎం.ఆర్.షా, అజయ్ రస్తోగీ శుక్రవారం పదవీ స్వీకార ప్రమాణం చేశారు. దీంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 28కి పెరిగింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ వీరిచేత ఉదయం పదిన్నరకు ప్రమాణం చేయంచారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా వీరికి పదోన్నతి కల్పించాలంటూ కొలీజియం చేసిన సిఫార్సుకు రాష్టప్రతి గురువారం ఆమోదం తెలిపారు. వీరిలో జస్టిస్ షా పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, జస్టిస్ రస్తోగీ త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, జస్టిస్ గుప్తా మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, జస్టిస్ రెడ్డి గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. కొలీజియం సిఫార్సులతో వీరికి సుప్రీం న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది.