జాతీయ వార్తలు

పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక ప్రక్షాళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మాతృభూమిని మర్చిపోకండి * బోత్స్వానాలో భారత సంతతి ప్రజలతో ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు
గబోరోనే (బోత్స్వానా), నవంబర్ 2: ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు వల్ల నేలమాళిగల నుంచి పడగగదులు, మరుగుదొడ్లలో దాచి ఉంచిన నల్లధనం బ్యాంకుల్లో డిపాజిట్ అయిందని, దేశ చరిత్రలో ఇదో విప్లవాత్మకమైన విధానమని ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. నల్లధనం నిర్మూలనకు దక్షిణాఫ్రికాదేశాలు ఇదే బాటలో పయనిస్తున్నాయన్నారు. పెద్ద నోట్ల రద్దు అనేది బాధకరమైన నిర్ణయం కావచ్చు. కాని దేశ ప్రయోజనాలకు ఇది ఉపయోగపడుతుందన్నారు. చివరకు తలగడల్లో దాచుకున్న నల్లధనం కూడా బ్యాంకులకు చేరిందన్నారు. ఇక్కడ స్థిరపడిన భారతీయ సంతతికి చెందిన వారి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నోట్ల రద్దంటే ఎవరికైనా బాధకలుగుతుందని, దీర్ఘకాలంలో దీని వల్ల చేకూరే లాభాలు చాలా ఉంటాయన్నారు. నల్లధనం నిర్మూలన బాధ్యత ఆర్‌బీఐ, ఆదాయం పన్ను శాఖపై ఉంటుందన్నారు. భారత ప్రభుత్వం దేశీయంగా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టిందన్నారు. విప్లవాత్మకమైన వస్తు సేవా పన్ను వల్ల దేశ సమైక్యతకు దారి తీసిందన్నారు. ఒకే దేశం, ఒకే పన్ను వల్ల దేశంలో వర్తకులు, ప్రజలకు ప్రయోజనం కలిగిందన్నారు. కేంద్రం తీసుకున్న చొరవ వల్ల 330 మిలియన్ల మంది బ్యాంకు ఖాతాలను తెరిచారన్నరు. గత ఏడాదిలో పన్ను పరిధిలోకి అదనం 26 శాతం మంది వచ్చారన్నారు. 68 మిలియన్ల మంది పన్నులుచెల్లిస్తున్నారన్నారు. బోత్స్వానా దేశం ప్రకృతి వనరులు, అందాలకు నిలయమని ఆయన ప్రశంసించారు. ప్రతి ఒక్కరు మాతృభాషను నేర్చుకోవాలని, మాట్లాడాలని, అదే సమయంలో ఇతర భాషలను నేర్చుకోవాలన్నాలవరు. స్థానిక సంస్కృతి, సంప్రదాయాలతో కలిసిపోయిన భారతీయులు తమ సొంత దేశాన్ని మర్చిపోరాదన్నారు. ఇక్కడ స్థిరపడిన వారు దశాబ్ధాలుగా ఇక్కడే ఉన్నారన్నారు. కేరళ వరద బాధితులకు స్థానిక ప్రజలు పెద్ద మొత్తంలో విరాళాలు ఇవ్వడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. భారతీయ సాంస్కృతిక సారథులుగా పనిచేయాలన్నారు.