జాతీయ వార్తలు

59 నిమిషాల్లో రూ.కోటి రుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఇన్‌స్పెక్టర్ రాజ్‌కు స్వస్తి * కంపెనీ, పర్యావరణ కార్మిక చట్టాల్లో మార్పులు
* రూ.6వేల కోట్లతో 20 హబ్‌లు * ప్రధాని మోదీ దీపావళి కానుక
న్యూఢిల్లీ, నవంబర్ 2: చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలు, వర్తకులకు శుభవార్త. వాణిజ్య వర్గాలకు దీపావళి పండగ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ తీపి కబురు నందించారు. 59 నిమిషాల్లో ఒక కోటి రూపాయల వరకు రుణాన్ని మంజూరు చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. దీనికి అనుగుణంగా కార్మిక, కంపెనీ లా చట్టాల్లో మార్పులను తెచ్చారు. వస్తు సేవా పన్ను కేటగిరీ కింద నమోదు చేసుకున్న సంస్థలకు 59 నిమిషాల్లో రూ.1 కోటి రుణాన్ని మంజూరు చేస్తారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని చెప్పారు. జీఎస్‌టీ కింద నమోదై సంస్థలకు రుణాలు మంజూరులో ప్రాధాన్యత ఇస్తారు. కొత్త రుణాలను రూ.1 కోటి వరకు తీసుకునే వారికి రెండు శాతం వరకు వడ్డీపై రాయితీ ఇస్తామన్నారు. దేశంలో వర్తకులకు రుణాల మంజూరును సులభతరం చేసేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. పర్యావరణ అనుమతులు, కంపెనీ, కార్మిక చట్టాల్లో మార్పులు తెస్తున్నామని, వీటిని మరింత సరళీకృతం చేస్తామన్నారు. పరిశ్రమల స్థాపనకు అడ్డుగా ఉన్న తనిఖీల అవరోధాలను తొలగిస్తామన్నారు. రుణాల కోసం దరఖాస్తులు వచ్చిన 48 గంటల్లోగానివేదికలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. ఇకపై ఇనెస్పెక్టర్లు పరిశ్రమలకు రుణాల మంజూరు ఇతర అంశాల విషయంలో తనిఖీలకు వెళ్లాల్సిన అవసరంలేదన్నారు. ఒక వేళ ఆ ఇనెస్పెక్టర్‌ను ఎందుకు వెళ్లావో అడగాల్సి ఉంటుందన్నారు. పర్యావరణ నిబంధనలను సరళీకృతం చేస్తామన్నారు. ఎనిమిది కార్మిక చట్టాలు, పది కేంద్ర నిబంధనలపై చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సాలీనా ఒకసారి రిటర్న్స్ దాఖలు చేస్తే సరిపోతుందన్నారు. కంపెనీల చట్టం కింద చిన్న తప్పిదాలకు పాల్పడిన పక్షంలో పెనాల్టీలను విధించే ప్రక్రియను కూడా సరళీకృతం చేస్తామని, ఈ మేరకు ఆర్డినెన్సును జారీ చేశామన్నారు. దేశంలో పరిశ్రమల రంగం అభివృద్ధికి మొత్తం 12 సూత్రాలను కచ్చితంగా అమలు చేస్తున్నామని, వీటి వల్ల సంస్కరణలు, అభివృద్ధి ఊపందుకుంటుందన్నారు. ప్రభుత్వ రంగసంస్థలు తమకు అవసరమైన సామాగ్రి, పరికరాలను చిన్న మధ్య తరహా పరిశ్రమల నుంచి 25 శాతం వరకు తప్పనిసరిగా కొనుగోలు చేయాలనే నిబంధనను విధించినట్లు చెప్పారు. అదే మహిళలు నిర్వహించే చిన్న పరిశ్రమల నుంచి అదనంగా మరో మూడు శాతం సామాగ్రిని కొనుగోలు చేయాల్సింటుందన్నారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు గవర్నమెంట్ ఈ మార్కెట్‌ప్లేస్‌లో కచ్చితంగా సభ్యత్వం పొందాల్సి ఉంటుందన్నారు. రూ.6వేల కోట్లతో 20 హబ్‌లను ఏర్పాటు చేస్తున్నామని, టెక్నాలజీ అప్‌గ్రేడ్ కోసం వంద టూల్ రూమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. చిన్న మధ్య తరహా ఫార్మా రంగంలో క్లస్టర్లను నెలకొల్పుతామన్నారు. రూ.500 కోట్ల కంటే మించి టర్నోవర్ ఉన్న కంపెనీలు తప్పనిసరిగా ట్రేడ్ రిసీవబుల్స్ ఈ డిస్కౌంటింగ్ సిస్టమ్ ప్లాట్‌ఫారమ్‌లో సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భారత్ 77వ స్థానానికి చేరుకుందన్నారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన అంశమన్నారు. గతనాలుగేళ్లలో కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ పరిశ్రమల రంగంలో అద్భుతమైన విజయాలు సాధించిందన్నారు. 2014లో ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో 142వ ర్యాంకు ఉంటే, ఈ రోజు 77వస్థానానికి ఎగబాకామన్నారు. త్వరలో తొలి 50వ ర్యాంకుల్లో స్థానం సంపాదిస్తామన్నారు.