జాతీయ వార్తలు

వైకాపా దీక్ష భగ్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడం సహా విభజన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను ఢిల్లీ పోలీసులు బుధవారం భగ్నం చేశారు. ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న ఆ పార్టీ ఎంపీలు మిథున్ రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో ఢిల్లీ పోలీసులు బలవంతంగా వారిని ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆంధ్రాభవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన అనంతరం వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి, అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డి తమ పదవులకు రాజీనామా చేసి ఆంధ్రాభవన్‌లో ఆమరణ నిరహారదీక్షకు దిగిన విషయం తెలిసిందే. మేకపాటి, వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో ఇంతకుముందే వారిని ఆస్పత్రికి తరలించారు. ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న ఎంపీలు అవినాశ్ రెడ్డి, మిథున్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి బుధవారంనాటికి తీవ్రంగా విషమించింది. వీరిని పరీక్షించిన వైద్యులు తక్షణమే దీక్ష విరమించాలని సూచించారు. ఈ సమాచారాన్ని ఢిల్లీ పోలీసులకు అందించారు. దీంతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్)ను రంగంలోకి దించారు. ఎంపీలను బలవంతంగా ఆస్పత్రికి తరలించేందుకు యత్నించడంతో ఆంధ్రాభవన్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో ఏపీకి న్యాయం చేయాలంటూ నినదిస్తూ వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు పోలీసులను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఎంపీలను తరలిస్తున్న అంబులెన్స్‌కు అడ్డంగా కూర్చొని నినాదాలిచ్చారు. ఈ పరిస్థితుల్లో పోలీసులు, వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం ఎంపీలను రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. ఎంపీలకు వైద్యులు బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించారు.
సీపీఐ సంఘీభావం
అంతకుముందు దీక్ష చేస్తున్న శిబిరాన్ని సందర్శించిన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని, దాన్ని అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందారని మండిపడ్డారు. విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ నిర్వహించిన బంద్‌లు, రైల్‌రోకోలు, దీక్షలతో ప్రత్యేక హోదా పోరాటం ఉద్ధృత స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు. అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా కేంద్రం అడ్డుకుంటోందని దుయ్యబట్టారు. ఏపీ హక్కుల సాధన కోసం తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని సురవరం స్పష్టం చేశారు. విజయ సాయిరెడ్డి మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి ఆమరణ నిరాహార దీక్షకు దిగడం జాతికే గర్వకారణమని, వారంతా చరిత్రలో నిలిచిపోతారని శ్లాఘించారు. తమ పార్టీ ఎంపీలు చేసిన ఈ త్యాగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటారని విజయ సాయిరెడ్డి అన్నారు.